ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS - YSRCP ATTACKS

YSRCP Rowdy Gangs Attacks on Alliance Activists: ఎన్నికల్లో ఓటమిని భరించలేక తిరుపతి జిల్లా చిల్లకూరులో కొందరు వైఎస్సార్సీపీ రౌడీ మూకలు టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత వర్గీయులు మారణాయుధాలతో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్, అతడి అనుచరులు దాడి చేశారు.

YSRCP Rowdy Gangs Attacks on Alliance Activists
YSRCP Rowdy Gangs Attacks on Alliance Activists (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 1:16 PM IST

YSRCP Rowdy Gangs Attacks on Alliance Activists: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో వైఎస్సార్సీపీ రౌడీ మూకలు, తెలుగుదేశం నేతలపై దాడికి పాల్పడ్డాయి. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు బాణసంచా కాల్చారు. దీంతో వైఎస్సార్సీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఆయన వర్గీయులు మారణ ఆయుధాలతో దాడి చేశారు. నాయుడుపేట టీడీపీకి చెందిన యువకులు అక్కడికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన విజయులు రెడ్డి, రాకేష్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కనుసన్నల్లోనే దాడి జరిగిందన్న విమర్శలు రావడంతో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, నిందితుడు సత్యనారాయణరెడ్డి అతని వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.

ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి - టీడీపీ నేతలకు తీవ్రగాయాలు (ETV Bharat)

ప్రశాంత ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ కడప రాజకీయం - సిట్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్లు - YSRCP Leaders Attack on Family

వైఎస్సార్సీపీ ఓడిపోయిందనే కక్షతో టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మారీస్ పేట 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని అనుచరులు అదే వార్డుకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ రావాల్సిన వార్డులో కూటమికి మెజార్టీ రావటంతో దాడి చేసినట్లు కార్యకర్తలు ఆరోపించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ 3టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ పాలనలో తమపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడులు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ శ్రేణులదాడిలో టీడీపీ కార్యకర్త మృతి- మరో ఇద్దరి పరిస్థితి విషమం - TDP and YSRCP workers clash

ABOUT THE AUTHOR

...view details