ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి - LELLA APPI REDDY SURRENDER IN COURT

అమరావతి మహిళలపై అనుచిత ప్రవర్తన కేసులో లొంగిపోయిన అప్పిరెడ్డి

Lella Appi Reddy surrender in Court
Lella Appi Reddy surrender in Court (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2024, 12:22 PM IST

Updated : Oct 10, 2024, 2:24 PM IST

Lella Appi Reddy surrender in Court : అమరావతి మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. 2020లో శివరాత్రి సందర్భంగా అమరావతి గుడి వద్ద రథోత్సవానికి రాజధాని ప్రాంత మహిళా రైతులు హాజరయ్యారు. అదే సమయంలో అప్పటి వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి కూడా ఆలయానికి వచ్చారు. జై అమరావతి నినాదాలు చేస్తున్న మహిళల పట్ల వారు అనుచితంగా ప్రవర్తించారు. వాహనాలు మీదకు పోనీయడంతోపాటు కొందరు నాయకులు మహిళలను దుర్భాషలాడారు.

Lella Appi Reddy Inappropriate Behavior Case :ఈ వ్యవహారంపై మండవ మహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో 2020 ఫిబ్రవరిలో అమరావతి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్​లో నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డితోపాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చారు. అప్పటి ప్రభుత్వంలో కేసు విచారణ ముందుకు సాగలేదు. ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఆయన్ను పీటీ వారెంట్​తో కోర్టులో హాజరుపర్చేందుకు అమరావతి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో అదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న అప్పిరెడ్డి అప్రమత్తమయ్యారు. తన న్యాయవాదుల సమక్షంలో సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయన లొంగిపోయారు. కేసు విచారించిన న్యాయమూర్తి అప్పిరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.

Last Updated : Oct 10, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details