ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవస్థల నిలయంగా జగనన్న కాలనీలు - లక్షలు దండుకున్న వైఎస్సార్​సీపీ నేతలు - YSRCP leaders Irregularities

YSRCP leaders Irregularities in Jagananna Colony: గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. జగనన్న కాలనీల పేరుతో జరిగిన దోపిడీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా స్థల సేకరణలో వైఎస్సార్​సీపీ నేతలు చేతివాటం ప్రదర్శించిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్​సీపీ నాయకులు ఎందుకూ పనికిరాని తమ భూమిల్ని ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించి, కాలనీలో రెండు మూడు ఇళ్లు కేటాయించుకొని లాభపడ్డారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 10:25 PM IST

ysrcp_leaders_irregularities
ysrcp_leaders_irregularities (ETV Bharat)

YSRCP leaders Irregularities in Jagananna Colony:జగనన్న కాలనీలు పేరు చెప్పి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థల సేకరణలో వైఎస్సార్​సీపీ నేతలు చేతివాటం ప్రదర్శించిన తీరు విస్మయం కలిగిస్తోంది. పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఎందుకూ పనికిరాని భూముల్ని ప్రభుత్వానికి అమ్మి వైఎస్సార్​సీపీ నాయకులు జేబులు నింపుకున్నారు. ఊరి బయట ఇళ్ల స్థలాలు పొందిన పేదలు, అక్కడ కనీస సదుపాయాలు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు.

జగనన్న కాలనీలు అంటేనే అనేక చోట్ల అక్రమాలు, అసౌకర్యాలు. హడావుడిగా గొప్పల కోసం పెద్ద ఎత్తులో కాలనీలు కాదు ఊళ్లే నిర్మిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఊకదంపు ప్రసంగాలు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాలనీల కోసం భూ సేకరణ దగ్గర నుంచీ, లబ్ధిదారుల ఎంపిక వరకూ అన్నీ అక్రమాలే. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన కాలనీ వ్యవహారం కూడా ఇదే తీరుగా నడిచింది.

వర్సిటీల్లో అభివృద్ధి మరిచి నిధులను హారతి కర్పూరంలా కరిగించేసిన జగన్ సర్కార్‌ - YSRCP Govt Neglected Universities

ఈ కాలనీ కోసం గత ప్రభుత్వం 8.5 ఎకరాలు భూములను సేకరించారు. ఈ భూములన్నీ వైఎస్సార్​సీపీ నేతలకు సంబంధించినవి. ఇక్కడకు వెళ్లడానికి సరైన దారి కూడా లేదు. ఎకరా 4, 5 లక్షల రూపాయలు కూడా విలువ చేయని భూమిని 17.50 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు సమయంలోనే లక్షల రూపాయలు గోల్‌మాల్‌ జరిగింది. భూములిచ్చిన రైతులు అధిక ధర పొందటంతో పాటు కొంతమంది ఈ కాలనీలో 3, 4 ప్లాట్లు కూడా పొందారు. వీటిని కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై గతం నుంచీ అనేక ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.

కాలనీలు కాదు ఊళ్లే నిర్మిస్తున్నామని చెప్పి లబ్ధిదారులను త్రిశంకు స్వర్గంలో నెట్టేశారు. కనీస సౌకర్యాల కల్పనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాలనీకి సరైన దారి లేదు. చెరువు మధ్యలో ఆక్రమించి, మట్టి దారిని నిర్మించారు. తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు. అంతర్గత రోడ్లు, కాలువలు కూడా లేకపోవటం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో తాగునీటి సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని కొత్త ప్రభుత్వాన్ని స్థానికులు వేడుకుంటున్నారు.

ఐదేళ్లుగా తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం - తుప్పుపట్టిన ప్రధాన గేట్లు - no repair for Tatipudi project

కాకాణి ఇలాకాలో అక్రమ లేఅవుట్లు - అనుమతి లేకున్నా ప్లాట్ల విక్రయం - YSRCP Leaders Illegal Layouts

ABOUT THE AUTHOR

...view details