YSRCP Leaders Illegal constructions in Bhimili Beach:వైఎస్సార్సీపీ హయాంలో కొండలు, గుట్టలు, వాగులతో పాటు గెడ్డలను సైతం ఆక్రమించుకుని బడా నాయకులు భూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. అధికారులు మాత్రం తమ బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టుకొస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టి ఒకాల్తా పలుకుతున్నారు. విశాఖ జిల్లా భీమిలీ బీచ్‌లో శిథిలమైన ఆల్ఫా పరిశ్రమ సమీపంలో సముద్రం పక్కన నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మీడియా పలు కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గారు.
విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada
ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతంలో గత వారం రోజులుగా కల్వర్టును ఆనుకొని టీఎస్ నెంబర్ 1522లో సుమారు ఎకరా గెడ్డ స్థలాన్ని పట్టపగలే జేసీబీతో చదును చేశారు. అక్కడతో ఆగకుండా ఫెన్సింగ్ ఫోల్స్ సైతం వేశారు. కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కనీసం కన్నెత్తి చూసే సాహసం చేయకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. పేదోడు గజం స్థలం ఆక్రమించుకుంటే (GVMC), రెవెన్యూ, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు పోలీస్ బందోబస్తుతో ఆక్రమణలు కూల్చివేయడం, ఆక్రమణదారులపై విరుచుకుపడతారు. అటువంటిది నిబంధనలను తుంగలో తొక్కి సముద్రంలోకి చొచ్చుకుపోతున్నా, గడ్డ వాగు స్థలాన్ని కబ్జా చేస్తున్నా పట్టించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.