YSRCP Leaders Demolition TDP Supporters Chicken Farm : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకుల దురాగతాలకు అడ్డేలేకుండా పోతోంది. తప్పులను ప్రశ్నించిన వారిపై తమ దారికి అడ్డొచ్చిన వారిపై కక్ష సాధింపులకు, దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ఆక్రమించుకోవడం లేదంటే నేలమట్టం చేస్తూ కాలకేయుల వలే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగింది. అధికార పార్టీలో చేరలేదని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతుదారుడి కోళ్ల ఫారాన్ని వైఎస్సార్సీపీ నేతలు కక్షగట్టి కూల్చేశారు.
90 సెంట్ల మెట్ట భూమి లీజు : రాజకీయ కక్షతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని పార్వతీశంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతుదారుడి కోళ్ల ఫారాన్ని అధికార పార్టీ మద్దతుదారు కూల్చేశారు. అడ్డువచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. పురపాలక సంఘం పరిధిలోని లక్ష్ముడుపేటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పైల అప్పారావుకు చెందిన సుమారు 90 సెంట్ల మెట్ట భూమిని 2019లో కోళ్లఫారం పెట్టుకునేందుకు కిల్లి వెంకట ప్రసాద్ లీజుకు తీసుకున్నారు.
చిచ్చు రాజేసి తానే శాంతపరిచినట్లు చేసి - కర్నూలులో అధికార పార్టీ సీనియర్ నేత అరాచకాలు
పొక్లెయిన్‌తో కోళ్ల ఫారం షెడ్ల ధ్వంసం : ఇటీవల కోళ్ల ఫారం లీజు కాలపరిమితి పూర్తి అయ్యిందని, ఖాళీ చేయాలని స్థల యజయాని అప్పారావు ప్రసాద్‌కు సూచించారు. లీజు 15 ఏళ్లకు ఉందని ప్రసాద్ చెప్పగా కేవలం అయిదు సంవత్సరాలకు మాత్రమే ఉందని అప్పారావు వాదించారు. ఈ క్రమంలో ఇద్దరికీ విబేధాలు వచ్చాయి. శుక్రవారం వేకువజామున అప్పరావుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు పొక్లెయిన్‌తో కోళ్ల ఫారం ఉన్న 3 షెడ్లను పడగొట్టేశారు. దీంతో కొన్ని కోళ్లతో పాటు కౌజు పిట్టలు మృత్యువాత పడ్డాయి.
కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు - దారికాచి మరీ టీడీపీ నేతపై దాడి
50 లక్షల రూపాయలు నష్టం :తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి రాలేదనే కక్షతోనే తన ఫారంపై దాడి చేశారని బాధితుడు కిల్లి వెంకట ప్రసాద్ వాపోయారు. షెడ్లు కూల్చివేయడంతో 50 లక్షల రూపాయలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా మాజీ కౌన్సిలర్ దుంపల చిరంజీవిరావుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పొక్లెయిన్‌ను సీజ్ చేశామని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. బాధితుడిని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవి కుమార్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన రావు పరామర్శించారు.
"కడప నయీం డిప్యూటీ సీఎం సోదరుడు-వెంటనే నగర బహిష్కరణ చేయాలి"
వైఎస్సార్సీపీ నేతల దాష్టికం - పార్టీలో చేరలేదని టీడీపీ మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత