YSRCP Leader Sajjala Bhargav Reddy Registered Case inPulivendulua :అధికారపార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన దళితుడైన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్‌రెడ్డితో పాటు పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పట్టణ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి ఐదేళ్లుగా టీడీపీ నేతలతో పాటు జగన్‌ను విమర్శించే వారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపైనా కేసు పెట్టారు.