పెండింగ్ బిల్లుల కోసం గుత్తేదారుల అవస్థలు YSRCP Govt Delaying Payment for Contractors Pending Bills: గుత్తేదారులు చేసిన పనులకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఏళ్ల తరబడి తిప్పించుకుంటోంది. దీంతో వైఎస్సార్సీపీ సర్కారు తీరుపై గుత్తేదారులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిలో భయం మరింత పెరిగిపోతోంది. లక్షల రూపాయల బకాయిలు ఉండటంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనులకు సంబంధించి బకాయిలు చెల్లించలేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
AP Contractors bills Problems: రాష్ట్రంలో బిల్లుల గోస.. వారికి మాత్రమే చెల్లింపులు..
ప్రకాశం భవనం శిథిలావస్థకు చేరిందని మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 3కోట్ల రూపాయలతో టెండర్లు వేసింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేసినప్పటికీ పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లిండంలో మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదని గుత్తేదారులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు ఆర్జీలు పెట్టడంతో రెండు దఫాలుగా కొంత చెల్లించారని తెలిపారు.
ఇంకా సుమారు 65 లక్షల రూపాయలు బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందించడంలేదని కాంట్రాక్టర్స్ అంటున్నారు. అధికారులను ఎన్ని సార్లు అడిగినా స్పందించకపోవడంతో స్పందనలో కూడా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. అయినా గుత్తేదారులు కష్టాలు తీరడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్స్ కోరుతున్నారు.
బకాయిలు చెల్లించాలని సమ్మె చేస్తే అక్రమ కేసులు బనాయించారు : కార్మికులు
"ప్రకాశం భవనం శిథిలావస్థకు చేరిందని గత ప్రభుత్వం మరమ్మతుల కోసం 3కోట్ల రూపాయలతో టెండర్లు వేసింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి మేము పనులు చేశాం. అయితే పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి తిప్పించుకుంటోంది. లక్షల రూపాయల బకాయిలు ఉండటంతో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మాకు భయం మరింత పెరిగిపోతోంది. జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు ఆర్జీలు పెట్టడంతో రెండు దఫాలుగా కొంత చెల్లించారు. ఇంకా సుమారు 65 లక్షల రూపాయలు బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందించడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా బకాయిలు చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం." - గుత్తేదారుల ఆవేదన
Pending Bills in AP: బిల్లుల కోసం హెలిప్యాడ్ గుత్తేదారుల ఎదురుచూపులు.. రూ.5 కోట్లకు పైగా బకాయిలు..