YSRCP Government Neglected Irrigation Canals in Prakasam District :సాగర్ జలాలు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల దాహార్తిని తీర్చుతాయి. అదే విధంగా వేలాది ఎకరాలు సాగుకు ఉపయోగపడతాయి. సాగర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే ఆ నీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నింపుతారు. ప్రకాశం జిల్లాలో పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు మండలాల్లో గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్లిస్తారు. కుడి కాలువ ద్వారా పమిడిపాడు బ్రాంచ్ కెనాల్, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటికి నీటిని పంపిణీ చేస్తారు.
ఈ ఏడాది నాగార్జున సాగర్‌లో పుష్కలంగా నీటి నిల్వలు ఉండటంతో ఆరు తడి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సాగుకు, వందల గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళిక వేసింది. అయితే నీరు ఇప్పుడు పొలాలు వరకూ చేరుతుందా లేదా అనే విషయంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ప్రధాన కాలువలు, బ్రాంచ్ కాలువలు, తూములు, షట్టర్లు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాలువలపై చెట్లు పెరిగి అడవులను తలపిస్తున్నాయి. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలువల నిర్వహణను పట్టించుకున్న పాపాన పోలేదు. నీటి పారుదలకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు.
రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains