ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టు'కు జగన్​ శాపం - ఐదేళ్లుగా రాయితీలు, ప్రోత్సాహకాలకు గండి - Silk Industry in West Godavari

YSRCP Government Neglect Silk Industry in West Godavari : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన పట్టు పరిశ్రమ ప్రస్తుతం కనుమరుగైంది. గత ఐదేళ్లు పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇవ్వక, శాఖాపరంగా ప్రోత్సాహకం లేక దివాలా తీసింది. కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక పట్టు పరిశ్రమకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

silk_industry_ap
silk_industry_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 9:28 AM IST

YSRCP Government Neglect Silk Industry in West Godavari :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పట్టు పరిశ్రమ వ్యవసానుబంధ కుటీర పరిశ్రమగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా ఉపాధి కల్పించే భాండాగారంగా ఈ పరిశ్రమకు పేరుండేది. గిరిజనులు పట్టణాలకు వలస పోకుండా ఎంతగానో ఉపయోగపడేది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నూతన పద్ధతుల్లో షెడ్లు నిర్మించి, మల్బరీ మొక్కలు పెంచి రైతులు పట్టు సాగు చేసేవారు. ఉమ్మడి జిల్లాలోని భీమడోలు, జీలుగుమిల్లి, కామవరపుకోట, బుట్టాయగూడెం ప్రాంతాల్లో సాంకేతిక సేవా కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. ఒక రైతు పట్టు సాగు చేస్తే సుమారు 10 మందికి ఉపాధి లభించేది. జగన్‌ ప్రభుత్వంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు, రాయితీలు రాకపోవడంతో పరిశ్రమ దివాలా తీసింది.

రాయితీలు, ప్రోత్సాహకాలకు గండి :2018 వరకూ అప్పటి ప్రభుత్వం ఎకరం మల్బరీ మొక్కల సాగుకు మూడేళ్ల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు అందించగా రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. అలాగే ప్రతి కిలో పట్టు పురుగులకు 50 రూపాయల ప్రోత్సాహక రాయితీ వర్తించేది. వీటితో పాటు పట్టుగూళ్లు కొనుగోలు చేసేందుకు కృష్ణా జిల్లా హనుమాను జంక్షన్ వద్ద పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు.

వైఎస్సార్సీపీ పాలనలో పడకేసిన పూడికతీత పనులు- నీరందక బీటలు వారిన వరి పొలాలు - Farmers suffer irrigation water

వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయితీలుగా సరిగా ఇవ్వకపోవడంతో ఈ పట్టు పరిశ్రమను నిలిపివేశాం. ఇక్కడ 10 మందికి దాకా ఉపాధి ఉండేది. ఇప్పుడు పట్టును ఉత్పత్తి చేయడానికి రైతులు లేకపోవడంతో కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు- పట్టు రైతులు

పడిపోయిన టమాటా ధరలు - పెట్టుబడి దక్కక రైతుల ఆందోళన - Tomato Prices Fall Down in AP

ఆదుకోవాలని విన్నపం :ప్రస్తుతం మెట్ట, మన్యం ప్రాంతాల్లో పట్టు సాగు పూర్తిగా కనుమరుగైంది. 2014లో 360 ఎకరాల్లో ఉన్న పట్టు సాగు 2018 నాటికి 1320 ఎకరాలకు విస్తరించింది. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, రాయితీలు నిలిపివేయడం వల్ల ప్రస్తుతం మల్బరీ తోటలు మచ్చుకైనా కనిపించడంలేదు. గతంలో పట్టు సాగులో ప్రతి దశలోనూ ఉద్యానవన శాఖ ద్వారా గిరిజనులకు వివిధ రకాల రాయితీలు అందుబాటులో ఉండేవి. వాటన్నింటినీ పునరుద్ధరించి పట్టు పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోరాటం - మూణ్నాళ్ల ముచ్చటగా చప్టా నిర్మాణం - bridge damage in nellore

ABOUT THE AUTHOR

...view details