YSR District Police Alert to Avoid Political Clashes : పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన హంసాకాండను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం సంబంధిత పోలీసు అధికారులు, కలెక్టర్లపై ఇప్పటికే వేటు వేసింది. మిగతా ప్రాంతాల్లో ఘర్షణలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ మేరకు వైఎస్సార్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలలో ఈ నెల 13న కడప, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలు చేపట్టారు.
EC Orders to Avoid Political Clashes in Andhra Pradesh :గురువారం రాత్రి వరకూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని నిడిజువ్విలో, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని దేవగుడిలో, కడప టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డిని ఆయన ఇంట్లో గృహనిర్బంధం చేశారు. కానీ ముగ్గురూ స్థానికంగా ఉంటే కౌంటింగ్‌లోగా గొడవలు జరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు ఊరు వదిలి వెళ్లాలని ముగ్గురినీ ఆదేశించారు. పోలీసులు జోక్యం చేసుకుని సుధీర్‌రెడ్డిని హైదారాబాద్ పంపించారు. భూపేష్‌రెడ్డిని బనగానపల్లెకు పంపిగా ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆదినారాయణరెడ్డిని కూడా దేవగుడి నుంచి హైదరాబాద్‌కి పంపించారు.
జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్ - సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారు అరెస్ట్ - 144 section In YSR District
మరోవైపు ఆదినారాయణరెడ్డి సోదరుల నివాసాల వద్ద, నిడిజువ్విలోని సుధీరరెడ్డి ఇంటివద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. జమ్మలమడుగులోని ప్రధాన కార్యాలయాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎవరూ గుంపులుగా తిరగొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ వరకు ఇదే బందోబస్తు కొనసాగించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కడపలోనూ పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా గౌస్ నగర్‌లో వాహనం ఎక్కి తొడలు కొట్టి కేకలు వేయడం పలు ఉద్రిక్తతలకు దారితీసింది. కౌంటింగ్ రోజూ కడపలో అల్లర్లు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే కడప వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. కౌంటింగ్ ముగిసేవరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని వైఎస్సార్సీపీ నాయకుల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అప్రమత్తమైన కడప పోలీసులు - జమ్మలమడుగులో 144 సెక్షన్, హెచ్చరికలు జారీ (ETV Bharat) జమ్మలమడుగులో టెన్షన్ - భారీగా పోలీసుల మోహరింపు - ప్రధాన పార్టీల అభ్యర్థులు గృహనిర్బంధం - Political Leaders House Arrest
నాయకులు అల్లర్లు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కార్యకర్తలంతా సంయవనం పాటించాలని అంజాద్ బాషా సైతం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే రెండు పార్టీల అభ్యర్థులు ఒకేరోజు ప్రకటనలు విడుదల చేయడంతో మున్ముందు ఏం జరుగుతుందోనని కలవరపడుతున్నారు. చిన్న గొడవ జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన హెచ్చరిస్తున్న పోలీసులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఇద్దరు జమ్మలమడుగు వాసులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలింగ్ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులుగా ఎవరంటే? - SIT Formation on Violence Incidents