శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా వివేకా సతీమణి YS Viveka Wife Sowbhagyamma Interview :రాజకీయ విభేదాలతోనే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ ఆరోపించారు. హంతకులను జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయని తెలిపారు. అయినా చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తన భర్త హత్య విషయం బాహ్యప్రపంచానికి కంటే ముందే జగన్, భారతికి తెలుసని తనకు కూడా అనుమానాలు ఉన్నాయని సౌభాగ్యమ్మ అన్నారు. ఉదయం హత్య జరిగితే సాయంత్రం వరకు జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడేందుకు తన కుమార్తె సునీత ఒంటరిగా న్యాయపోరాటం చేస్తుంటే అండగా ఉండాల్సిన జగన్ ఎందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రశ్నించారు.
సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లు ఇస్తామన్నారు : దస్తగిరి
జగన్‌కు ఓటు వేయవద్దు : సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే చివరిక్షణంలో కూడా సునీత జగన్‌కు అవకాశం ఇచ్చినా పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన కూల్చడంతోనే ప్రారంభించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్న సౌభాగ్యమ్మ జగన్ సీఎం కావాలని వివేకానందరెడ్డి కలలు గన్నారనే కానీ ఇలాంటి పాలన కోసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనైనా మంచి నాయకుడు రాష్ట్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నానన్న తాను రాజకీయం అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుందని చెప్పారు. జగన్‌కు ఓటేయొద్దని తన కుమార్తె సునీత (Sunita on AP Elections) అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు.
ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలి - హైకోర్టులో దస్తగిరి పిటిషన్
ఒంటరిగా న్యాయ పోరాటం : అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్ వద్దకు వెళ్లింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా, ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారని తెలిపారు.
ఇంక అక్కడ న్యాయం జరగదని తెలిసి అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు పూర్తవకపోవడం, హంతకులకు శిక్షపడకపోవడంపై సౌభాగ్యమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
"రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య (Viveka Murder Update) చేశారని తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడేదాక నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్ అండగా ఉండకపోగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు చేయాలని డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పైగా నా కుమార్తె సునీత న్యాయం కోసం జగన్ వద్దకు వెళ్తే అవమానకరంగా మాట్లాడారు.- సౌభాగ్యమ్మ, వివేకా సతీమణి
వివేకా హత్య విషయంలో తన కుమార్తెను, అల్లుడిని అనుమానించారని తెలిపారు. హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసేటప్పుడు కూడా తనకు సహకరించాలని జగన్‌ను సునీత కోరిందని, కానీ అతను పట్టించుకోకుండా లెక్కలేకుండా మాట్లాడారని అన్నారు. ఇంక చేసేది ఏమీ లేక సునీత ఒంటరి పోరాటం చేస్తోందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మా నాన్నని వాళ్లే చంపారు - అప్పట్లో మాకు అర్థం కాలేదు : వైఎస్ సునీత
ఎంపీ టికెట్ విషయంలోనే వివేకాను సీఎం జగన్ చంపించారు : దస్తగిరి