ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్​కు మద్దతు - వృద్ధులపై వైసీపీ నేతల దాడి - వీడియో విడుదల చేసిన వైఎస్ సునీత - YCP Leaders Attacks - YCP LEADERS ATTACKS

YS Sunitha reaction to YCP Leaders Attack on Elderly Couple: కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేస్తున్నారన్న నెపంతో వృద్ధ దంపతులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలను వివేక కుమార్తె సునీత మీడియాకు విడుదల చేశారు.

ycp_leaders_attacks
ycp_leaders_attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 10:18 PM IST

Updated : Apr 22, 2024, 6:33 AM IST

వైసీపీ నేతల దుశ్చర్య- కాంగ్రెస్​కు మద్దతిస్తున్నారని వృద్ధులపై దాడి! దృశ్యాలను విడుదల చేసిన వైఎస్ సునీత

YS Sunitha Reaction to YCP Leaders Attack on Elderly Couple:వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేస్తున్నారన్న నెపంతో లింగాల మండలం మురారిచింతలో వృద్ధ దంపతులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు వృద్ధ దంపతులపై వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దాడి దృశ్యాలను వైఎస్ వివేక కుమార్తె సునీత మీడియాకు విడుదల చేశారు.

ఆస్తిలో వాటా నా హక్కు- రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు: షర్మిల - YS SHARMILA ELECTION CAMPAIGN

జగన్మోహన్ రెడ్డిపై చిన్న రాయి వేసిన యువకుడిపైన హత్యాయత్నం కేసు పెట్టి లోపల వేసిన పోలీసులు పులివెందుల నియోజకవర్గంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి విచక్షణారహితంగా వారిపై దాడి చేసిన వ్యక్తులపై నామ మాత్రంగా కేసులు పెట్టి బయటికి పంపించారని సునీత మండిపడ్డారు. వృద్ధ దంపతులపై దాడి చేసిన వ్యక్తులు యథేచ్ఛగా మళ్లీ బయట తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మురారిచింతల్లో జరిగిన ఘటనలపై తరచూ తాను ప్రశ్నిస్తుండడం వల్లే వైసీపీ నాయకులకు ముఖ్యంగా అవినాష్ రెడ్డికి వణుకు మొదలైందని సునీత అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తగ్గించేందుకు వైసీపీ కుట్రలు- వినియోగంపై శిక్షణ ఇవ్వండి: టీడీపీ - Varla Ramaiah writes to EC

దీంతో ఎన్నికల అయ్యే వరకు ఇలాంటి ఘటనలకు దూరంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు అవినాష్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోందని చెప్పారు. నేను ప్రశ్నించడంతోనే వైసీపీ కార్యకర్తలకు అవినాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ఎన్నికలు అయ్యేవరకు ఇలాంటి ఘటనలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం అందిందని అన్నారు. ఇది కూడా ఒక రకంగా మంచిదే అని ఇలాంటి ఘటనలు పులివెందుల నియోజకవర్గంలో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ప్రశ్నించాలని సునీత విజ్ఞప్తి చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తాను తరచూ ప్రశ్నిస్తుండడం వల్లే అవినాష్ రెడ్డికి దడ మొదలైందని సునీత అన్నారు.

గలకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు - Stone Attack Accused Durga Rao

మురారిచింతలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ కేసు మాత్రం బెయిల్​బుల్​ కేసు కింద పెట్టారు. ఆ కొట్టిన వాళ్లు ఊర్లో మల్లీ తిరుగుతున్నారు. ఈ సంఘటన బయటపెట్టంగానే వైసీపీకి, అవినాష్​ రెడ్డికి ఆందోళన మొదలైంది. ఎన్నికల అయ్యే వరకు ఇలాంటి ఘటనలకు దూరంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు అవినాష్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకున్న సమస్యలను బయటపెట్టండి. మీకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించండి. మనకు న్యాయం జరగాలంటే పోరాడాలి.- సునీత, వివేకా కుమార్తె

Last Updated : Apr 22, 2024, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details