Youtuber Harsha Sai Victim Complaint Again : సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.
హర్ష సాయి బాధితురాలి మరో ఫిర్యాదు - ఈసారి కంప్లైంట్ ఏంటంటే? - Complaint on Youtuber Harsha Sai - COMPLAINT ON YOUTUBER HARSHA SAI
Another Complaint on Youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలైన తనపై నీచంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ వాపోయింది. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Another Complaint on Youtuber Harsha Sai (ETV Bharat)
Published : Oct 4, 2024, 10:11 AM IST
తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అదే బాధితురాలు హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ట్రోలింగ్ వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడం గమనార్హం.