YouTuber Behara Prasad Arrested :సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో ప్రసాద్ పరిచయమయ్యాడని, షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయగా క్షమాణలు చెప్పాడని బాధితురాలు పేర్కొన్నారు.
రింగ్ రోడ్డు పక్కన డబ్బులు - ఇన్‌స్టాగ్రామ్‌లో 'మనీ హంటింగ్' ఛాలెంజ్
అనంతరం కొద్ది రోజుల తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశామని, ఆ సమయంలో అందరి ముందు మీద పడుతూ, ముట్టుకుంటూ వేధించాడని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ నెల 11న షూట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనను కొట్టాడని పేర్కొన్నారు. ఎందుకు కొట్టావు అని అడగ్గా 'అందరి ముందు జోక్ చేద్దామని' అని అన్నాడని వివరించింది. ఈ మేరకు ఆమె బెహరా ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
హర్షసాయిపై రేప్ కేసు - ఇన్‌స్టాలో స్పందించిన యూట్యూబర్ - Rape Case on youtuber Harsha Sai
గుర్తింపు కోసం రోడ్లపై డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ - కట్ చేస్తే కటకటాలపాలు - YouTuber Scatters Money On Road