Young Ministers in AP CM Chandrababu Naidu Cabinet :ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపు, ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో, కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతోపాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 - 40 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.
17 New Faces in CM Chandrababu Team : టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం! వారితో పాటు మరి కొందరు సీనియర్లకూ వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం. పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి.
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మంత్రి యోగం ఎవరెవరికో? - AP NEW CABINET MINISTERS list
AP Cabinet :1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలోకి వచ్చాక స్పీకర్‌గా పని చేసిన కాలంలో తప్ప, మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజార్టీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని క్యాబినెట్‌లోకి తీసుకోకుండా, మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
AP New Ministers :ప్రస్తుత క్యాబినెట్‌లోని 24 మందిలో తొలిసారి మంత్రులైనవారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో రెండు విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్టయింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ను, బీజేపీ నుంచి సత్యకుమార్‌ని క్యాబినెట్‌లో చేర్చుకోవడంతో పాటు టీడీపీ నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది.