ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్ కొనివ్వలేదని తాళం చెవులు మింగిన యువకుడు - చివరికి ఏమైందంటే! - YOUNG MAN SWALLOWS FOUR KEYS

పల్నాడు జిల్లా అనూహ్య ఘటన - బైక్ కొనివ్వలేదని నాలుగు తాళం చెవులు మింగిన యువకుడు

Young Man Swallows Four Keys
Young Man Swallows Four Keys (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 12:36 PM IST

Young Man Swallows Four Keys :ద్విచక్ర వాహనం కొనలేదని తల్లిదండ్రులపై కోపంతో ఓ యువకుడు 4 తాళం చెవులను మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. గుంటూరు సర్వజనాసుపత్రి (GGH) అత్యవసర విభాగానికి వచ్చిన ఆ బాధితుడికి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. దీంతో అతడు ప్రాణాలతో బయట పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే

ఆలస్యంగా గుర్తించి తల్లిదండ్రులు : పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన యువకుడికి(28) తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం కొనివ్వలేదు. దీంతో ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని బుధవారం సాయంత్రం 4 తాళం చెవులు మింగాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు కుమారుడ్ని గురువారం ఉదయం గుంటూరు జీజీహెచ్‌కు హుటాహుటిన తీసుకొచ్చారు.

కోత లేకుండా, నొప్పి తెలియకుండా - కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్

ఎండోస్కోపీ కెమెరా సహాయంతోనే : యువకుడికి వైద్యులు పరీక్షలు చేశారు. అనంతరం ఎండోస్కోపీ కెమెరా (Endoscopy Camera) గొట్టాన్ని శరీరం లోపలికి పంపారు. తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆకరికి ఆ నాలుగ తాళం చెవులు ఎక్కుడ ఉన్నాయో వైద్యులు గుర్తించారు. ఎండోస్కోపీ కెమెరా సాయంతోనే తాళం చెవులను బయటకు తీశారు. ఒక తాళం చెవి తరువాత మరొకటి ఇలా మొత్తం నాలుగింటిని వైద్యులు బయటకు తీయగలిగారు.

కుట్లు, కోతలు లేకుండా తీశాం :ఆ విభాగం అధిపతి ఆచార్య కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. తొలుత తాము ఒకటే మింగాడని భావించామని తెలిపారు. ఎండోస్కోపీ సాహాయంతో పరికరాన్ని లోపలికి పంపి పరీక్షించిన తరువాత మొత్తం 4 తాళం చెవులు ఉన్నట్లు గుర్తించామని, అనంతరం వాటిని బయటకు తీయగలిగామని అన్నారు. 24 గంటల లోపు వచ్చినందున తేలికగానే ఎటువంటి కుట్లు, కోతలు లేకుండా తీయగలిగామని, ఆలస్యంగా వస్తే సర్జరీ చేయక తప్పదని వివరించారు. ఈ చికిత్సలో తనతో పాటు సహాయ ఆచార్యులు శివరామ కృష్ణ, విద్యార్థి వైద్యుడు అనిల్‌ పలువురు పాల్గొన్నట్లు వివరించారు.

అభినందనలు :యువకుడికి సత్వరమే చికిత్స అందించిన వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ ఎస్‌ఎస్‌వీ రమణ ప్రత్యేకంగా అభినందించారు.

నేను లోకల్​ - అప్పట్లో బైక్​పై వెళ్లేవాన్ని : బాలయ్య

ABOUT THE AUTHOR

...view details