Young Man Murder in Panladu District : పల్నాడు జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగానే కొబ్బరి బొండాల కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. వినుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న షేక్ రషీద్(25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి (జులై 17న) ఘటన చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని పెద్దమసీదు బజారుకు చెందిన రషీద్ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. నగదు లెక్కించి లెక్క రాసి బయటకు రాగానే దుకాణం బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ షేక్ జిలాని కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణ రహితంగా మెడ, తల, ఒంటిపై దాడి చేయడంతో రషీద్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ సంఘటనలో షేక్ రషీద్ ఒక చేయి తెగి పక్కన పడింది.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి - murder attempt on tdp leader
Vinukonda Panladu Districtస్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్న అతడిని పోలీసులు 108 వాహనం ద్వారా ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ అతన్ని వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. షేక్ రషీద్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.