Young Man Excels in Kickboxing of Guntur District : ఆశయం గొప్పదైతే అవకాశాలు దానంతట అవే వస్తాయి. దానికి కావల్సిందల్లా ఎంచుకున్న లక్ష్యం కోసం ఆహర్నిశలు కృషి చేయడమే అదే చేస్తున్నాడు ఓ యువకుడు. ఆశయ సాధన కోసం అలుపెరుగకుండా కష్టపడుతున్నాడు. గమ్యం చేరుకోవడం కోసం తన గమనాన్ని మార్చుకుని సాధన చేస్తున్నాడు. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యం.. పవర్ లిఫ్టింగ్‌లో యువకుడి సత్తా
వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ప్రతిరోజు శారీరక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడు చలాది సతీష్ అనే యువకుడు. ఇతడు గుంటూరు జిల్లా సీతానగరంలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే కిక్‌బాక్సింగ్‌లోని కిటుకులను ఒక్కొక్కటిగా నేర్చుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు.
International kickboxer in AP : మార్షల్‌ఆర్ట్స్‌లో రాణించలనేది సతీష్ చిన్ననాటి కళ తల్లిదండ్రులు వద్దని వారించినా యుద్ధవిద్యలు నేర్చుకోవాలనే తపనతో కరాటేలో ప్రావీణ్యం సంపాదించాడు. నలుగురిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కిక్ బాక్సింగ్‌ను ఎంచుకున్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మందుకు సాగాడు. బ్రూస్‌లీ, తమ్ముడు వంటి సినిమాలు చూసి యుద్ధవిద్యలు నేర్చుకోవాలనే అసక్తి కలిగిందని సతీష్ చెబుతున్నాడు. 2021 గోవాలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించానని సతీష్ అంటున్నాడు. ఫిబ్రవరిలో వరల్డ్ ఆసోసియోషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ నిర్వహించిన ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో 2 రజత పతకాలు సొంతం చేసుకున్నాని చెబుతున్నాడు.