ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదులుతున్న ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య - SUICIDE IN BUS AT TIRUPATI

ఆర్టీసీ బస్సులో యువకుడు ఆత్మహత్య - కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రేణిగుంట పోలీసులు

Suicide in APSRTC Bus at Tirupati
Suicide in APSRTC Bus at Tirupati (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2024, 12:51 PM IST

Updated : Nov 24, 2024, 4:26 PM IST

Suicide in APSRTC Bus at Tirupati : ఎవరూ ఊహించని విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఎమో తెలీదు కానీ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. ఇది చూసిన ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఉరి వేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఏర్పేడు సమీపాన ఓ యువకుడు ఎక్కాడు. వెనుక సీట్లో యువకుడు కూర్చున్నాడు. ఆ సమయంలో బస్సులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వారు కూడా ముందు సీట్లలో కూర్చున్నారు. ఈ తరుణంలో వెనుక సీట్లో ఉన్న యువకుడు ఉరి వేసుకున్నాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించారు. ఆ ఘటనను చూసిన కండక్టర్ భయాందోళనకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ బస్సును ఆపేశారు. అనంతరం కండక్టర్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రేమోన్మాది వేధింపులు - భరించలేక యువతి ఆత్మహత్య

ఆర్టీసీ బస్సులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి:బస్సులో ప్రయాణిస్తున్న యువతి, ఒక్కసారిగా కదలిక లేకుండా ఉండిపోయింది. దీంతో హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు. డ్రైవర్, కండక్టర్ సైతం ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అమ్మాయి కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మన్యం జిల్లా సాలూరు RTC బస్సులో చోటు చేసుకుంది.

ప్రయాణికులు, బస్ కండక్టర్ తెలిపిన వివరాల మేరకు, మన్యం జిల్లా సాలూరు డిపోకి చెందిన RTC బస్సు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంnలోకి సమీపంలోకి రాగానే ఓ యువతి అపస్మారక స్థితిలో పడిపోయింది. తోటి ప్రయాణీకులు గుర్తించి, బస్సు సిబ్బందికి తెలపడంతో ఆర్టీసీ బస్సుతో పాటు, అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువతి విజయనగరంకి బస్సు ఎక్కి వెళ్తుండగా, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. గతంలో ఈమెకు మూర్ఛ వ్యాధి వచ్చిందని ఆసుపత్రికి వచ్చిన ఆమె బంధువులు వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత యువతి కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అప్పుల భారం - ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య

Last Updated : Nov 24, 2024, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details