ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక విశిష్టత ఉన్న ఎర్రమట్టి దిబ్బలను ప్రమాదంలోకి నెట్టిన వైసీపీ నేతలు- పట్టించుకోని అధికారులు - Red Mud Dunes - RED MUD DUNES

YCP Government Destroyed Red Mud Dunes : రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలను వైసీపీ విధ్వంసకరంగా మార్చింది. పర్యటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఎర్రమట్టి దిబ్బలను జగన్​ సర్కార్​ నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం ఎర్రమట్టి దిబ్బల వద్దకు ఎవరూ వెళ్లకుండా వైసీపీ ప్రస్తుతం కంచెను నిర్మించింది.

red_mud_dunes
red_mud_dunes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 7:48 PM IST

YCP Government Destroyed Red Mud Dunes : అధికార పార్టీ నేతలు విశాఖను విధ్వంసకరంగా మార్చేశారు. రుషికొండను ధ్వంసం చేయడం మొదలు కొండలు, గుట్టలను సైతం వదలడం లేదు. అక్కడితో ఆగకుండా భీమిలికి సమీపంలోని జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను వదల్లేదు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ కంచె నిర్మించారు. దీంతో సందర్శకులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విస్తుగొలుపుతోంది.

ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం - ఊరూరా వైఎస్సార్సీపీ నేతల అరాచకం - YCP Irregularities

Visakha :విశాఖ భీమిలికి సమీపంలో ఉన్న 'ఎర్రమట్టి దిబ్బలు' భౌగోళిక చరిత్ర ఆనవాళ్లకు నిదర్శనం. దక్షిణాసియాలో ఇటువంటివి మూడుంటే అందులో ఇదొకటి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2014లో ఈ దిబ్బలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పరిరక్షించాల్సింది పోయి వాటి ఉనికి ప్రమాదంలో పడేలా చేసింది. కొద్ది రోజులు క్రితం వరకూ పర్యాటకులు ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు జేవీ అగ్రహారం నుంచి వెళ్లి అక్కడున్న వీక్షణ స్తంభం పైనుంచి చూసేవారు. కానీ ప్రస్తుతం అక్కడికి వెళ్లడానికి వీలు లేకుండా మధ్యలోనే కంచె నిర్మించారు.


అవినీతి, అక్రమాల్లో ఆ వైఎస్సార్సీపీ నేత "రాజా ది గ్రేట్‌"! - YSRCP Leader Family Irregularities

ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడికక్కడ అక్రమణలకు గురవడంతోపాటు కొండలను తవ్వి మట్టి తరలించేశారు. దిబ్బల వద్ద ఉన్న భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలాలున్నాయి. భీమిలి నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ప్రతిపాదన రావడంతో అక్కడి స్థలాలకు విలువ పెరిగింది. దీంతో సొసైటీ స్థలంపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత మరికొందరు చోటా నేతలు కలిసి సొసైటీ వారిని బెదిరించి స్థలాలు దక్కించుకున్నట్లు సమాచారం.

దిబ్బల వద్ద ఉన్న భూములు వివాదాస్పదంగా మారడంతో ఇప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడి స్థలాలకు విలువ పెంచేందుకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థతో లేఅవుట్ నిర్మించారు. కొందరు వైసీపీ ముఖ్య నేతలు ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో 60 ఎకరాల్లో రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు.

నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities

ఎర్రమట్టి దిబ్బల్లోని 262 ఎకరాలను వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన తర్వాత ఆ ప్రాంత సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సమీప ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చూడాలి. కానీ అందుకు వ్యతిరేకంగా జగన్ సర్కారు ఆ ప్రదేశాన్ని ప్రమాదంలోకి నెట్టేలా నిర్మాణాలు చేపట్టింది. చెట్లు, పొదలను యంత్రాలతో తొలగించడంతో వరదలకు భవిష్యత్తులో ఎర్రమట్టి దిబ్బలు కుంగిపోయే ప్రమాదం ఉంది.

ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్న వైసీపీ సర్కారు - నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details