Woman Files Rape Case on Auto Driver in Gachibowli: ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిన ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆర్సీ పురం వద్ద ఆటో ఎక్కినట్లు ఆమె తెలిపింది. రెండున్నర గంటల సమయంలో మసీదుబండ ప్రాంతానికి చేరుకున్నాక తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి అమీర్‌పేటలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తుంది.
ఆటోలో అత్యాచారం! - ఆటో డ్రైవర్‌పై ఫిర్యాదు చేసిన యువతి - WOMAN FILES RAPE CASE ON AUTODRIVER
ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని గచ్చిబౌలి పీఎస్‌లో యువతి ఫిర్యాదు - కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు - నిందితుడి కోసం గాలింపు
Published : Oct 15, 2024, 12:39 PM IST
|Updated : Oct 15, 2024, 5:22 PM IST
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. నిన్న రాత్రి ఆత్యచారం చేశారని ఫిర్యాదు చేసిన యువతిని వైద్య పరీక్షలు నిమిత్తం కొండాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలకు యువతి సహకరించడం లేదు. దీంతో పోలీసులు యువతికి వైద్యుల చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా యువతి పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. యువతిని ఆటో డ్రైవర్ ఎక్కడ ఎక్కించుకున్నాడు, ఎటువైపు తీసుకెళ్లాడో తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
వరంగల్‌లో ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం - Gang Rape On Pharmacy Student