WOMAN DIED IN FIRE ACCIDENT: వాళ్లది నిరుపేద కుటుంబం. ప్రతి రోజూ కూలీకి వెళ్తేనే పొట్టనిండేది. అలాంటిది విద్యుత్తు పాత బకాయిలు చెల్లించలేదంటూ అధికారులు వారి కనెక్షన్ తొలగించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీకటిలో నిద్రించలేక ఆ ఇల్లాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన ఊదరి భాగ్యమ్మ(40) కూలి పనిచేసేది. ఆమె భర్త యాదగిరి కూరగాయల తోటలకు పందిరి వేస్తాడు. భాగ్యమ్మ, యాదగిరి దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి పెళ్లికాగా, ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు 6 సంవత్సరాల క్రితం చెరువులో పడి చనిపోయాడు. 15 రోజుల క్రితం భాగ్యమ్మ భర్త యాదగిరి పని నిమిత్తం కరీంనగర్ జిల్లాకు వెళ్లాడు.