ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధం - తీసింది ఇద్దరి ప్రాణం - extra marital relationship suicide - EXTRA MARITAL RELATIONSHIP SUICIDE

Woman and Youth Suicide: పెళ్లై పిల్లలున్నా యువతి, యువకుడి వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను అనాథలును చేసింది. వారి సంబంధం ఊర్లో తెలియడంతో పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలను నడిరోడ్డున నిలబెట్టారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.

Woman and Youth Suicide
Woman and Youth Suicide (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 8:05 PM IST

Woman and Youth Suicide :వివాహేతర సంబంధంతో తమ జీవితాలతో పాటు కుటుంబాలను సైతం చీకట్లోకి నెట్టేస్తున్నారు కొందరు. ఇలాంటివి సహించలేక హత్యలకు దారి తీస్తే మరికొన్ని ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకెళ్తున్నాయి. మరికొందరు పరువు కోసం ప్రాణాలను వదులుకుంటున్నారు. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Extra Marital Relationship Suicide :జిల్లాలోని కురుపాం మండలానికి చెందిన యువతి (30)కి, సీతంపేట మండలానికి చెందిన వ్యక్తి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సీతంపేట మండలానికి చెందిన మరో యువకుడు (34)కి భార్య, కుమార్తె ఉన్నారు. కురుపాంకు చెందిన యువతి, సీతంపేటకు చెందిన మరో యువకుడి మధ్య కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఈ నెల 3న గ్రామం నుంచి పారిపోయారు. మొదటగా యువతి కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed the Uncle

పారిపోయిన యువతి యువకుడు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం అందింది. దీంతో ఈ నెల 16న సర్పంచి, కుటుంబ సభ్యులు వెళ్లి వారిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకొస్తుండగా సీతంపేట సమీపంలో తొలుత యువతి, తర్వాత యువకుడు మూత్ర విసర్జన కోసమని కారు దిగారు. మళ్లీ యథావిధిగా కారు లోపలికి వచ్చారు. కొంచెం దూరం వెళ్లే సరికి వీరి ఇద్దరి నోటి నుంచి నురగ రావడంతో పురుగు మందు తాగారని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. మరుసటి రోజు యువకుడు ప్రాణాలు వదిలేశాడు. యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీతంపేట ఎస్‌ఐ జగదీశ్‌ నాయుడు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

DSP నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్‌- లేడీ పోలీస్​తో వివాహేతర సంబంధమే కారణం! - Uttar Pradesh Police Demotion

అందుకే ఆత్మహత్య చేసుకున్నారా? :యువకుడికి, యువతికి వేరు వేరుగా కుటుంబాలు ఉన్నా కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఊరు విడిచి పోయిన వారిని కుటుంబ సభ్యులు పట్టుకుని తీసుకొస్తున్నారు. గ్రామంలోకి వెళ్తే పిల్లలు, ప్రజల వద్ద పరువు పోతుందనే కారణంతో దారిలో పురుగు మందు తాగి ఉంటారని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రేమికుడితో కలిసి భర్తను చంపేసి - గుండెపోటని అందరినీ నమ్మించింది - చివరకు నిందితుడి పశ్చాత్తాపంతో! - Wife Killed Husband In Madhuranagar

ABOUT THE AUTHOR

...view details