ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులో ప్రారంభమైన వింటర్​ ఫెస్ట్​ - ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్‌ - WINTER FESTIVAL IN ARAKU VALLEY

మారథాన్​తో ప్రారంభమైన అరకు చలి ఉత్సవాలు - ప్రారంభించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

winter_festival_in-araku_valley_started_by_collector_dinesh_kumar
winter_festival_in-araku_valley_started_by_collector_dinesh_kumar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 10:11 AM IST

Updated : Jan 31, 2025, 12:19 PM IST

Winter Festival in Araku Valley started By collector Dinesh Kumar : అరకు చలి ఉత్సవాలు నేటి నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారి యంత్రాంగం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అరకులోయలో మారథాన్‌ పోటీలతో ప్రారంభమైన ఉత్సవాలు మొదలయ్యాయి. మారథాన్ పోటీల్లో యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవాలకు వేలాదిమంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల్లో ఏడు రాష్ట్రాల్లోని గిరిజన కళాకారులు వారి కళలను ప్రదర్శించనున్నారు. ఇవి గిరిజన ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

సాహస ఔత్సాహికుల కోసం పారా గ్లైడింగ్, హాట్‌ ఎయిర్‌ బెలూన్, హెలికాప్టర్‌ రైడ్‌ నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి అరకు లోయ ఉత్సవ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 వరకు అరకు చలి ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడింగ్, హార్ట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్‌.

అరకులో చలి ఉత్సవాలు - హెలికాప్టర్​లో అందాలు చూసేయండి

Winter Festival in Araku Valley : మంచు దుప్పట్లో అరకు అందాలను ఆస్వాదించేలా ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. రెండో రోజు (ఫిబ్రవరి 1)న బొర్రా గుహల నుంచి ఉత్సవ వేదిక వరకు సైక్లింగ్‌ పోటీ, అరకు ఫ్యాషన్‌ షో, థింసా నృత్యం, మణిపురి స్కిట్స్, జిమ్నాస్టిక్స్, రేలారే రేలా నృత్యం, వెస్ట్రర్న్‌ ఆర్కెస్ట్రా, కామెడీ స్కిట్స్‌ మూడోరోజు (ఫిబ్రవరి 2) సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద అరకు ట్రెక్కింగ్, రంగోలి, పెయింటింగ్‌ పోటీలు, వాయిద్యాం, వెస్ట్రర్న్‌ డ్యాన్స్, షాడో డ్యాన్స్, ఫ్యాషన్‌ షో, ఫోక్‌ సాంగ్స్, లేజర్‌ షో నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం అరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చెప్పారు.

అరకు ఉత్సవాల్లో ప్రదర్శించే పారాగ్లైడింగ్ ట్రయల్​ రన్ విజయవంతం

Last Updated : Jan 31, 2025, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details