ETV Bharat / state

'వికసిత ఏపీకి సహకరించండి' - నీతి అయోగ్ ఉపాధ్యక్షుడుని కోరిన సీఎం చంద్రబాబు - NITI AAYOG TEAM MEET CHANDRABABU

నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్‌బేరితో సీఎం భేటీ - వికసిత ఏపీ స్వర్ణాంధ్ర-2047కు సహకరించాలని వినతి

NITI_Aayog_Team_meet_Chandrababu
NITI_Aayog_Team_meet_Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 6:24 PM IST

NITI Aayog Team meet CM Chandrababu: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత ఏపీ స్వర్ణాంధ్ర -2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని సీం చంద్రబాబు నీతి అయోగ్‌కు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌భేరి బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఆకాంక్షలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఏఐ ప్రొఫెషనల్, వన్‌ ఎంట్రప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని దీనికి కేంద్రం సాయం అవసరమని సుమన్‌బేరీని సీఎం కోరారు. ఏపీ ప్రతియేటా 15 శాతం వృద్ధిరేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఎంతో అనుకూల సమయమని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని సీఎం అన్నారు. ఇందులో నీతి అయోగ్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని సుమన్‌బేరీ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రం ఇంకా విభజన సమస్యల నుంచి తేరుకోలేదని 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్ధిక వివాదాల గురించి నీతి అయోగ్‌కు వివరించారు. అలాగే హైదరాబాద్‌ను వదులుకోవాల్సి రావడంతోపాటు ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వసతులను కల్పించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని సీఎం వివరించారు.

రాష్ట్రంలో పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో ముందంజ వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు నీతి అయోగ్ బృందానికి తెలిపారు. దేశంలోనే మూడో అతిపెద్ద తీరప్రాంతం కలిగిన రాష్ట్రం కావడంతో పోర్టులు- హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ కలిగి ఉన్నామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లతో తూర్పు- ఆగ్నేయాసియాకు ఏపీ గేట్‌వేగా ఉందని తెలిపారు. పునరుత్పాదకత విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలుగా తెలిపారు. దేశంలోని నాలుగు గ్రోత్‌ హబ్‌ల్లో ఒకటిగా ఉన్న విశాఖ ఎకనామిక్ రీజియన్‌తోపాటు తిరుపతి-అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని సీఎం కోరారు.

పోటీ కోసమే ర్యాంకులు - ఎవరినీ తక్కువ చేయడానికి కాదు: సీఎం చంద్రబాబు

డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్ట్​నర్‌షిప్స్, ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్‌డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలనే ఆకాంక్షను సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి 3 నెలలకు సమీక్ష చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం - నీతి ఆయోగ్ కలిసి పని చేయాలని ప్రతిపాదించారు. నదుల అనుసంధానం, పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మాలన, 2047 విజన్‌లోని 10 ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

3 సీ పోర్టులు, 3 ఎయిర్ పోర్టులు ఉన్న తిరుపతి-చెన్నయ్-నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సీఎం గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఏపీలో అమలు చేయాలనేది తమ విధానమని సీఎం చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు, అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గాలి, బడులు తెరిచేనాటికి డీఎస్సీ పూర్తవ్వాలి: సీఎం చంద్రబాబు

వాట్సప్‌ గవర్నెన్స్‌లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతి: లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.