MLA Kolikapudi Srinivasa Rao Another Controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనని అక్రమ కేసులతో కొలికిపూడి వేధిస్తున్నాడని ఆత్మహత్య యత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ప్రస్తుతం డేవిడ్ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకు రాకుండా కొలికిపూడి అందరినీ బెదిరించాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివేకా హత్యపై జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? - త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి: దస్తగిరి
రాంగోపాల్‌వర్మ విచారణ స్టార్ట్ - అంతకుముందు వైఎస్సార్సీపీ నేతతో మంతనాలు