Wild Cat Cubs in Kothapalli : అడవిలో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీటి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి శివారులోని పొలాల్లో 4 అడవి పిల్లి పిల్లలు లభ్యమయ్యాయి. వరి పొలంలో గట్టుపై ఉన్న వీటిని చూసి రైతులు ఆందోళనకు గురయ్యారు.
ఇవి పులి కూనలని భయపడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అవి అడవి పిల్లి పిల్లలని నిర్ధారించారు. వాటిని అక్కడే ఉంచి రక్షణ కల్పించారు. కొంత సమయం తర్వాత వాటిలో రెండింటిని తల్లి పిల్లి వచ్చి తీసుకెళ్లింది. మిగతా వాటిని కూడా తీసుకెళ్తుందని వారు చెప్పారు.