ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖతర్నాక్ లేడీ! మూడు పెళ్లిళ్లు, ఇద్దరితో ఎఫైర్ - ఆస్తి కోసం భర్తను చంపి కర్ణాటకకు పార్సిల్

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి మూడో భర్తను హత్య - కర్ణాటకలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి దహనం

wife_murders_husband_with_lover
wife_murders_husband_with_lover (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

A Wife who Killed her Husband along with her Boyfriend in Hyderabad : ఆమెకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి మూడో భర్తను హత్య చేసింది. హైదరాబాద్‌లో చంపేసి మృతదేహాన్ని కర్ణాటకకు తరలించి దహనం చేసింది. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడటంతో ఆమెతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన నిహారిక(29) వరుసగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను, హరియాణాకు చెందిన మరో వ్యక్తిని వివాహాలు చేసుకుని విడాకులిచ్చింది. రెండో భర్తపెట్టిన కేసులో జైలుకు వెళ్లగా ఆమెకు మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది. అనంతరం బెంగళూరుకు మకాం మార్చింది.

"ఇంట్లో ఇల్లాలు - లాడ్జిలో ప్రియురాలు" రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ ఎంపీడీఓ

అనంతరం మాట్రిమోనీ వేదిక ద్వారా హైదరాబాద్‌ తుకారంగేట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది. రమేశ్‌కు అప్పటికే భార్య, కుమార్తె ఉన్నారు. అయినా ఇద్దరూ 2018లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఘట్‌కేసర్‌ పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో కాపురం పెట్టారు. ఉద్యోగం పేరిట నిహారిక బెంగళూరుకు వెళ్లివచ్చేది. ఈక్రమంలో నిహారిక ఈ నెల 4న పోచారానికి రాగా అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేశ్‌కుమార్‌ గొడవపడ్డాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన నిహారిక రాణాను వెంటబెట్టుకొని తిరిగొచ్చింది. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. రాత్రి 11 గంటల సమయంలో కారులో బయటికి వెళ్లారు. హత్యకు ముందే పథకం సిద్ధం చేసుకున్న నిహారిక, రాణాలు మేడిపల్లి ఠాణా పరిధి పీర్జాదిగూడ కమాన్‌ వద్ద రమేశ్‌ను కారులోనే కొట్టి చంపారు.

అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed the Uncle

ఈ విషయాన్ని నిహారిక బెంగళూరులోని మరో ప్రియుడు నిఖిల్‌రెడ్డికి చెప్పింది. అతడి సూచనతో మృతదేహాన్ని కారులోనే కర్ణాటకలోని కొడుగు జిల్లా సుంటికుప్ప ప్రాంతానికి తరలించారు. అక్కడ ఓ కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి దహనం చేసి పారిపోయారు. అక్టోబరు 8న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాఫీ తోట, చుట్టుపక్కల ప్రాంతాల్లో 500 సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. వాటిలో నమోదైన కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేశ్‌కుమార్‌ పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తిని కాజేసేందుకే హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. కేసును మేడిపల్లి ఠాణాకు బదిలీ చేయనున్నారు.

హత్యకు దారితీసిన సహజీవనం - మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడి ఘాతుకం

ABOUT THE AUTHOR

...view details