ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా ? - ఏయే డాక్యుమెంట్స్ కావాలో తెలుసా ! - Documents for Education at Abroad - DOCUMENTS FOR EDUCATION AT ABROAD

What Documents Required to Study Abroad: విదేశాల్లో చదువుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. ఇందుకోసం చదువుకునే సమయం నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే విదేశాల్లో చదువుకోలాంటే తప్పనిసరిగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీకు తెలుసా?

Documents_Required_to_Education_at_Abroad
Documents_Required_to_Education_at_Abroad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 10:57 AM IST

What Documents Required to Study Abroad: విదేశాలకు వెళ్లి చదువుకోవడం చాలామంది విద్యార్థుల కల. ఫారిన్‌ డిగ్రీలపై యువతకు నానాటికీ మోజు పెరుగుతోంది. ఇందుకోసం చదువుకునే సమయం నుంచే చక్కని ప్రణాళిక, సన్నద్ధతతో మెరుగైన కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ అంటూ వివిధ దేశాలకు పయనమవుతున్నారు. కష్టపడి చదువు పూర్తి చేశాక అక్కడే తమ ప్రతిభకు తగిన ఉద్యోగం సాధించి సెటిల్‌ అవుతున్నవారెందరో. అయితే, విదేశాల్లో చదువు భారీ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు, ఇందుకోసం అనేక డాక్యుమెంట్లూ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

విదేశాల్లో విద్యకు ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే:

  • విదేశాలకు వెళ్లాలనుకునే ఎవరికైనా పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. విదేశాల్లో చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు ముందుగా పాస్‌పోర్టును సిద్ధం చేసుకోవాలి.
  • విద్యార్థి ఏ దేశానికైతే చదువు కోసం వెళ్తున్నారో ఆ దేశం అనుమతికి సంబంధించి మంజూరు చేసిన వీసా కూడా ఉండాలి.
  • విద్యార్థులు తమ రెజ్యూమ్‌ని సిద్ధం చేసుకోవాలి. స్టూడెంట్​గా తాను సాధించిన లక్ష్యాలు, పనిలో అనుభవం, ఇతర నైపుణ్యాలు ఏమైనా ఉంటే వాటిని అందులో పేర్కొనాలి. టెస్ట్‌ స్కోరు (జీఆర్‌ఈ, ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్‌)నూ పొందుపరచాలి.
  • రికమండేషన్‌ లెటర్‌ (సిఫారసు లేఖ) ఉండాలి. తన దరఖాస్తును సమర్థిస్తూ ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లు సిఫారసు చేసినట్లుగా లేఖలను సిద్ధం చేసుకోవాలి.
  • అభ్యర్థి బ్యాంక్‌ స్టేట్​మెంట్​ కచ్చితంగా ఉండాలి. ఫైనాన్షియల్‌ ప్రూఫ్‌ చూపిస్తేనే విదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది ఆ వ్యక్తి ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
  • విద్యార్థులు ఏదైనా స్కాలర్‌షిప్‌ లేదా ఫైనాన్సియల్‌ అవార్డుకు ఎంపికైతే వాటికి సంబంధించిన లెటర్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌:విదేశాల్లో ఎందుకు చదవాలనుకుంటున్నారో, తమ విద్య, జీవిత లక్ష్యాలను వివరిస్తూ ఒక వ్యాసరూపక స్టేట్‌మెంట్‌ సిద్ధం చేసుకుని ఉండాలి.
  • స్పాన్సర్‌షిప్ అఫిడవిట్‌:విద్యార్థులు తమ విదేశీ చదువులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన చట్టబద్ధత కల్పించే డాక్యుమెంట్‌ కలిగి ఉండాలి.
  • అభ్యర్థికి తప్పనిసరిగా విద్యా రుణాలు లేదా ఆర్థిక సహాయాన్ని నిర్ధరించే లెటర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • వీటితో పాటు సదరు విద్యార్థులు అకడమిక్‌ డాక్యుమెంట్లు, డిప్లొమా, గతంలో చదివిన విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details