చివరికి అనుకున్నదే సాధించారు - అవ్వాతాతలను సచివాలయాల ముందు ఎండలో నిల్చో పెట్టారు Door To Door Pension Issue :రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి భారత ఎన్నికల కమిషన్ తప్పించింది. దీంతో ఈ నెల 1న లబ్ధిదారుల చేతికి పింఛన్లు అందలేదు. దీంతో అవ్వాతాతలు కాసింత కలవరపాటుకు గురయ్యారు. ఆ రోజు నుంచి పింఛన్ డబ్బులు ఎవరిస్తారు. ఎప్పుడిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం జోరుగా నడిచింది. సచివాలయం దగ్గర వద్దు, అధికాకారులు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆఖరికి ప్రభుత్వం అనుకున్నదే సాధించింది.
సచివాలయాలకు రావాల్సిందే :ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని ఇలా పలు కారణాలు చూపించి చివరకు పింఛనర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది. ఈ మేరకు బుధవారం నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఉత్వర్వులతో వృద్ధులు, మహిళలు గ్రామ సచివాలయాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర? - Door To Door Pension Distribution
సచివాలయాల వద్ద అవ్వాతాతల పడిగాపులు : రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోసం వృద్ధులు, మహిళలు గ్రామ సచివాలయాల వద్ద నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు అందలేదని, నిధులు ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్న సచివాలయ సిబ్బంది తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సిబ్బంది ఇంకా సచివాలయాలకు రాలేదని అంటున్నారు. మధ్యాహ్నం తర్వాత పంపిణీ చేస్తామని చెప్పడంతో ఉదయం నుంచి పడిగాపులుకాస్తున్నారు. సచివాలయాల వద్ద తగిన సమాచారం ఇచ్చే సిబ్బంది అందుబాటులోలేక పెన్షన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ఉదయం నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తారనుకుని పెద్ద ఎత్తున వృద్ధులు వచ్చారు.
సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీ- పంతం నెగ్గించుకున్న వైసీపీ ప్రభుత్వం - Pension Distribution ISSUE IN AP
ఎండ తీవ్రంగా ఉన్నా కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు. తాగునీరు సౌకర్యం కల్పించ లేదు. కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు ఉదయం 8 గంటలకు తమ తమ సచివాలయాలు వద్ద పెన్షన్ తీసుకునేందుకు రావాలని ప్రకటించడంతో ఉదయం 7 గంటలకే పెన్షన్ దారులు భారీగా చేరుకున్నారు. అయితే పెన్షన్ ఇచ్చేందుకు సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఇంకా బ్యాంకు అకౌంట్‌లోకి నగదు జమ కాలేదని జమ అయిన వెంటనే విత్ డ్రా చేసి ఇస్తామని చెబుతున్నారు. మధ్యాహ్నం పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పడంతో సచివాలయాల వద్ద ఎండకు వేచి ఉండలేక వృద్ధులు మహిళలు తిరిగి వెళ్లిపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఇస్తామంటూ సిబ్బంది లబ్ధిదారులను వెనక్కి పంపుతున్నారు. ఎండకు టెంటు, తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అంటున్నారు. పింఛన్ ఇంకా ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుయాయులకే బిల్లులు- పింఛన్లకూ డబ్బుల్లేకుండా ఊడ్చేసిన వైసీపీ సర్కార్ - Payment Of Bills During Elections