గమ్య నగరి విశాఖకు వచ్చే పర్యాటకులు కైలాసగిరికి వెళ్లకుండా ఉండరు. ఆ కొండ మీది నుంచి సముద్ర తీరం అందాలు కనువిందు చేస్తాయి. మరో వైపు విస్తరించిన నగరం ముచ్చటగొలుపుతుంది. కొండల మధ్య వీక్షణ ప్రదేశాలు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పటికే రోప్ వే, చిన్న రైలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) చర్యలు చేపట్టింది. కొండపై అన్ని వైపులా నూతన వసతులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
నక్షత్రశాల :
నిధులు:రూ.37 కోట్లు
వచ్చేవి :యువత, విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానం వైపు నడిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
ప్రస్తుతం:7 ఎకరాల్లో నిర్మించాలనేది ప్రణాళిక. బిర్లా సైన్స్ కేంద్రం (Birla Science Centre) సహకారంతో నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు లేఖ రాశారు.
సాహస కృత్యాలు :
నిధులు : రూ. నాలుగు కోట్లు
వచ్చేవి : జిప్ లైనర్, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి
ప్రస్తుతం :జిప్ లైనర్, స్కై స్కైక్లింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. కొండ మీద మెట్ల మార్గం వైపు 150 మీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. నడక వంతెన అందుబాటులోకి వచ్చేసరికి కొంత సమయం పట్టనుంది.
రివాల్వింగ్ రెస్టారెంట్ :
నిధులు:రూ.18 కోట్లు
వచ్చేవి:సముద్ర తీరం కనిపించేలా భోజనశాలలు, విశ్రాంత గదులు, సమావేశ మందిరాలు ఈత కొలను ఉంటాయి. పర్యాటకులు బస చేసేందుకు వీలుగా హరిత గృహాలు నిర్మిస్తారు. ఇక్కడ ఉన్న అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి రెస్టారెంట్‌గా మార్చాలనేది ఆలోచన.