ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుది ఘట్టానికి సిరిమానోత్సవాలు - రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు

వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు, భారీ బందోబస్తుతో తుది ఘట్టం వేడుక ఏర్పాట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

ammavari_sirimanotsavam_vizianagaram
ammavari_sirimanotsavam_vizianagaram (ETV Bharat)

Ammavari Sirimanotsavam Vizianagaram :ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సోమవారం తొలేళ్ల సంబరం వైభవంగా సాగగా ఇవాళ సాయంత్రం అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. లక్షల మంది భక్తులు తరలొచ్చే ఉత్సవాల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిరిమానోత్సవ నిర్వహణకు 2వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పైడితల్లి ఉత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓబిళేసు అందిస్తారు.

Minister Presented Silk Clothes to the Goddess on Behalf of State Government : శ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది రాకుండా సినిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!

సిరిమానోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఆలయ అధికారులు భక్తుల కోసం 50 వేలు చొప్పున లడ్డూలు, పులిహోరా ప్యాకెట్లు సిద్ధం చేశామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తుల సౌకర్యార్థం నగరంలోని 20 ప్రాంతాల్లో చలివేంద్రాలు పారిశుద్ధ్య పనుల కోసం అదనంగా 300 మంది కార్మికుల నియామకం జరిగింది. సిరిమానోత్సవ పర్యవేక్షణకు 2 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిమాను ఊరేగింపు జరిగే ప్రాంతంలో 80 సీసీ కెమెరాలు పెట్టించారు. అమ్మవారి ఆలయం ఎదురుగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ అందుబాటులో ఉండేలా చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు- పైడితల్లి సిరిమానోవత్సానికి ఏర్పాట్లు ఇలా

ABOUT THE AUTHOR

...view details