ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూట్యూబర్ ‘ఫన్‌ బకెట్‌’ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష - COURT VERDICT ON FUN BUCKET BHARGAV

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష - అలాగే రూ. 4 లక్షల జరిమానా విధించిన విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు

Court Verdict On Youtuber Fun Bucket Bhargav Rape Case
Court Verdict On Youtuber Fun Bucket Bhargav Rape Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 9:44 AM IST

Updated : Jan 11, 2025, 9:52 AM IST

Court Verdict On Youtuber Fun Bucket Bhargav Rape Case :మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. 2021 లో నిందితుడు చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ మైనర్ బాలికను టిక్ టాక్ వీడియోల చిత్రీకరణ నెపంతో తన నివాసానికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు చెబితే వీడియోలను సామాజిక మాధ్యమాలలో బయటపెడతానని బెదిరించాడు. కొన్ని రోజులు తర్వాత బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు 4 నెలల గర్భవతిగా నిర్ధరించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి ఆనంది ఈ కేసు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. నిందితుడు ఫన్ బకెట్ భార్గవ్‌కు కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు.

Last Updated : Jan 11, 2025, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details