ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్తాబైన విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌ - త్వరలో లగ్జరీ క్రూజ్‌ షిప్​లు రాక - VIZAG INTERNATIONAL CRUISE TERMINAL

2025 మార్చి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు - సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక సహా వివిధ దేశాలకు నడిపేలా ప్రయత్నాలు

Vizag International Cruise Terminal
Vizag International Cruise Terminal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 2:07 PM IST

Vizag International Cruise Terminal : విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపేందుకు క్రూజ్‌ టెర్మినల్‌ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్​గా దీన్ని పిలుస్తున్నారు. ఈ ఐసీటీని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్‌ రూ.57.55 కోట్లు వెచ్చించి సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో తీర్చిదిద్దారు. దాదాపు రెండువేల మందిని తీసుకెళ్లే సామర్థ్యం గల క్రూజ్‌లు ఇక్కడ నిలిపేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేశారు. కస్టమ్స్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సేవా కౌంటర్లు, డ్యూటీఫ్రీ షాపులు, రిటైల్‌ అవుట్‌లెట్‌లు, ఫుడ్‌ కోర్టులు, లాంజ్‌లతో ఈ టెర్మినల్‌ సిద్ధమైంది.

నౌక ఆకారంలో విశాఖ ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్‌ (ETV Bharat)

'ది వరల్డ్ క్రూజ్‌ షిప్‌' : 2023 సెప్టెంబరులో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్‌ షిప్‌ అయిన 'ది వరల్డ్ క్రూజ్‌ షిప్‌' ఈ టెర్మినల్​కు వచ్చింది. 2025 మార్చి నుంచి ఇక్కడ పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాయల్‌ కరేబియన్, కార్డిలియా, ఎంఎస్‌సీ వంటి ప్రముఖ క్రూజ్‌ లైనర్లతో సంబంధిత అధికారులు చర్చలు జరుపుతున్నారు. థాయిలాండ్, సింగపూర్, శ్రీలంక సహా వివిధ దేశాలకు అలాగే చెన్నై, సుందర్‌బన్స్‌ వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి క్రూజ్‌లు నడిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోతున్న టెర్మినల్‌కు ఇటీవల వచ్చి వెళ్లిన ది వరల్డ్ క్రూజ్‌ షిప్‌ (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details