Visakha Police Arrested to Human Traffickers: విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, గాజువాకకు చెందిన చుక్క రాజేశ్ ఇంజినీరింగ్ చదివి గల్ఫ్ దేశాల్లో పని చేశాడు. 2021 నుంచి ఆ దేశాలకు మ్యాన్ పవర్ సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు. 2023లో సంతోష్ సాయంతో 27 మందిని కంబోడియాకు పంపించాడు. టికెట్స్, వీసా పేరుతో ఒక్కొక్కరి దగ్గర రూ.90 వేల వరకు వసూలు చేసి వారిని చైనా ముఠాలకు విక్రయించాడు. మరో ఏజెంట్ ఆర్య ద్వారా ఇలాగే ఒక్కో బాధితుడి నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేశాడు. హబీబ్, ఉమామహేశ్ ఏజెంట్‌ల సాయంతో దాదాపు 150 మందిని బ్యాంకాక్ గుండా కంబోడియాకు పంపించాడు. అక్కడ వీరిని చైనా కంపెనీలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు విడిగా పెట్రోలు, డీజిల్ విక్రయాలు వద్దు: ఈసీ - EC Orders TO Petrol Bunks IN AP
బాధితులకుసైబర్ నేరాల్లో తర్ఫీదు: చైనా ముఠాల చేతికి చిక్కిన బాధితులకు సైబర్ నేరాల్లో శిక్షణ ఇప్పించేవారు. ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలకు గురి చేసి తమ దారికి తెచ్చుకునేవారు. ఈ ముఠా నుంచి తప్పించుకున్న బాధితుడు బొత్స శంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ సీపీ రవిశంకర్, జాయింట్ సీపీ ఫక్కీరప్పల పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె.భవానీ ప్రసాద్ విచారణ చేపేట్టారు. నిందితుడు రాజేశ్, ఏజెంట్స్ సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వర్‌రావులను అరెస్టు చేశారు. చైనా ముఠాలు భారతీయులతో సైబర్ క్రైమ్‌లు
కాంబోడియాకు తీసుకెళ్లి చిత్రహింసలు:ఈ కేసుకు సంబంధించి విశాఖలో పోలీస్ కమిషనర్ సీపీ రవి శంకర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో రాజేశ్వరరావు, జ్ఞానేశ్వరరావు, కొండలరావును అనే ఏజెంట్లను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కాంబోడియా (Cambodia)లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపి నిర్బంధించారని వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తరువాత చైనాకు చెందిన మాఫియా కంపెనీలు వీరిచే బలవంతంగా సైబర్ స్కామ్‌లు చేయిస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్యులను పెడెక్స్ స్కామ్‌లోకి ఎలా లాగాలో శిక్షణ ఇస్తారని తెలిపారు. నిరుద్యోగుల నుంచి రూ. లక్షన్నర చొప్పున వసూలు చేసి ఇందుల్లో 80 శాతం కాంబోడియా వారికి ఇచ్చి మిగతాది వీరు తీసుకుంటున్నారని తెలిపారు.
రెండేళ్లుగా సాగుతున్న ముఠా ఆగడాలు : కాంబోడియాకు వెళ్లిన వారు ఒత్తిళ్లకు లొంగి స్కామ్‌లు చేసేవారికి రూ. 600 డాలర్లు ఇస్తారని, మాట వినకుంటే చిత్ర హింసలు పెడతారని పేర్కొన్నారు. ఈ ముఠా ఆగడాలు రెండేళ్లుగా నడుస్తున్నాయని అన్నారు. కేసు గురించి ఇప్పటికే కాంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపామని, కేసు దర్యాప్తుకు కాంబోడియాలోని భారత ఎంబసీ(India Embassy) సహకారం తీసుకుంటామని సీపీ వివరించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తామని సీపీ రవి శంకర్ వెల్లడించారు.
ఆలయ భూములపై కన్ను - పూజారి కిడ్నాప్! 12 రోజులు చిత్రహింసలు - PRIEST KIDNAP
అక్కడి వెళ్తే కొత్త రోగాలు! ఆందోళనలో బాధితులు - Patients problems in nellore GGH