Viral Fever Cases Rising In AP : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్యులు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జ్వరాలు పెరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వర్షాకాలం రావటంతో సీజనల్ వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై జనరల్ ఫిజీషియన్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ, " ఇప్పటివరకు మలేరియా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలు వరకు నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటి ప్రమాద తీవ్రత స్థాయి తక్కువగానే ఉంది. చాలా మందికి ఇంటి వద్దేనే చికిత్స పొందుతున్నారు. హటాత్తుగా వాతావరణంలో మార్పులు జరిగితే దోమలు పెరుగుతాయి.
అలాగే గాలిలో ఉన్న వైరస్ లను ముందుగా దోమలు తీసుకుంటాయి. వాటి లార్వా నుంచి మనిషి శరీరంలోకి ఆ వైరస్లు చేరుతాయి. దీంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరుగుతున్నాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు సోకి రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ రోగాలతో వచ్చిన అందరికీ లక్షణాల ఆధారంగా పరీక్షలు చేస్తున్నాము. అదేవిధంగా ఫీవర్ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే జ్వరాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం" అని డా. శ్రీనివాసరావు తెలిపారు.