Violation Of Election Code by YSRCP Leaders: ఎన్నికల కోడ్ వెలువడి వారం రోజులు దాటినా క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు వైఎస్సార్సీపీ నేతలు తిలోదకాలిస‌్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినా అధికారులు ఇంకా వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నారని విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.
YSRCP Attack On Person For Entered Details In C vigil App: ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్సార్సీపీ నేతల కోడ్ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారిపై పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైఎస్సార్సీపీ కార్యాలయానికి రంగులు తొలగించలేదని తెలుగుదేశం కార్యకర్త నాగుల్ భాషా సీ విజిల్ యాప్ (C Vigil app)లో ఫిర్యాదు చేశారు. దీంతో వైఎస్సార్సీపీనేతలు నాగుల్ భాషాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీనేత పోలా పూర్ణతోపాటు మరికొందరు తనని కొట్టారని బాషా తెలిపారు.
సీ-విజిల్లో ఫిర్యాదు - వ్యక్తిపై వైసీపీ నేత దాడి - YCP Attack C Vigil Complaint Person
Bapatla: బాపట్లలోని భీమావారిపాలెం సచివాలయం వాట్సాప్ గ్రూపులో ప్రతిపక్షాల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం చేస్తూ వాలంటీర్లు పోస్టులు పెట్టారు. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్‌ని టీడీపీకి అంటగడుతూ శనివారం కొన్ని పోస్టులు పెట్టి షేర్ చేశారు. బాపట్ల మండలం కొండబట్లపాలెం వాలంటీరు వాట్సాప్ గ్రూపులో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వీడియోలు పెట్టి ప్రచారం చేస్తూ దొరికిపోయాడు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరినందుకు కొల్లూరు మండలం కిష్కింధపాలెంకు చెందిన కూటమి సానుభూతిపరుడు కొల్లి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేతలు చేశారు. తెలుగుదేశం, జనసేన జెండాలు తొలగించి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, జెండాలు ఎందుకు వదిలేశారని వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. దీంతో ఎంపీటీసీ (MPTC), సర్పంచ్ మరో ఇద్దరు కార్యకర్తలు తనపై దాడిచేశారని వెంకటేశ్వరరావు తెలిపారు.