Elderly woman Dies After Receiving Pension :పింఛన్ సొమ్ము అందుకున్న వృద్ధురాలు కొద్ది నిమిషాలకే తుది శ్వాస విడిచిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన కురందాసు సత్యవతి (84) శనివారం ఉదయం పింఛన్ డబ్బులు తీసుకున్న 20 నిమిషాలకే మృతి చెందారు.
ఒకటో తేదీన ఇచ్చి ఉంటే పింఛన్ తీసుకునే అవకాశమే ఆమెకు ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. సత్యవతి పొందిన పింఛను నగదుతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో కూటమి సర్కారు ముందుగా అందించిన రూ.4000 పింఛనుతో ఆమెకు గౌరవంగా అంతిమ యాత్ర నిర్వహించామని గ్రామస్థులు తెలిపారు.