రెండు నుంచి నాలుగు - విశాఖ-విజయవాడ రైల్వే ట్రాక్‌ల విస్తరణ (ETV Bharat) Vijayawada-Visakha Railway Track Expansion :అత్యంత రద్దీగా ఉండే విజయవాడ–విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్‌ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతమున్న రెండు ట్రాక్‌లను ఏకంగా నాలుగు ట్రాక్‌లుగా విస్తరించేందుకు రైల్వే బోర్డుకు డీపీఆర్ (DPR) పంపించారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలోనే పెద్ద ఎత్తున రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరోవైపు ట్రాక్‌లు నిర్మించేలోపు రైళ్ల రాకపోకలు మరిత పెంచేలా ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు. అధునాతన ట్రాక్ సహా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో విజయవాడ–విశాఖ ప్రధానమైనది. రెండూ పెద్ద జంక్షన్లు కావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది రైళ్లు వీటి మీదుగా నడుస్తాయి. వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాల మీదుగా నడుస్తుండటంతో రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం విజయవాడ– విశాఖ మీదుగా రోజూ 120 రైళ్లు నడుస్తున్నప్పటికీ రద్దీకి ఇవి సరిపోవడం లేదు. నెల రోజుల ముందే బోగీల్లోని బెర్తులన్నీ నిండిపోతాయి. జనరల్ బోగీల్లో కనీసం నిల్చునేందుకు కూడా చోటు ఉండదు. ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నా కేవలం రెండు ట్రాక్‌లే ఉండటంతో నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్- రూ.2 లక్షల కోట్లతో పచ్చజెండా - 8 National Highways Expansion
సమస్యపై దృష్టి సారించిన రైల్వే అధికారులు విజయవాడ-విశాఖ మార్గంలో పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్గాన్ని రెండు నుంచి ఏకంగా నాలుగు లైన్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి ఆమోదముద్ర పడటం లాంఛనంగానే కనిపిస్తోంది. నాలుగు లైన్లుగా విస్తరిస్తే ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకు రెట్టింపు నడిపొచ్చని అధికారులు తెలిపారు.
"సాధారణంగా డబుల్ లైన్ నుంచి త్రిబుల్ లైన్‌కు వెళ్తాం. కానీ ఇక్కడి పరిస్థితి, ప్రజల అవసరాల బట్టి మూడు, నాలుగు లైన్లకు అనుమతి కోసం కేంద్రానికి సిఫార్సు పంపించాం. అతి త్వరలోనే ఇందుకు అనుమతి వస్తుంది" -వావిలపల్లి రాంబాబు, ఏడీఆర్ఎం విజయవాడ డివిజన్
నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ విస్తరణ పనులు పూర్తయ్యేలోపు పరిస్థితిని మెరుగు పరిచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ ఎన్నో ఏళ్ల క్రితం వేసినది కావడంతో రైళ్లు గంటకు 130 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లలేకపోతున్నాయి. దీంతో వందేభారత్ రైళ్లు వేగాన్ని సైతం తగ్గిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని వందేభారత్ రైళ్లు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా పాత ట్రాక్‌ని తొలగించి ఆధునీకరిస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా భద్రంగా ఉండేలా ట్రాక్‌లను నిర్మిస్తున్నారు. అధునాతన అటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించింది. పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చినా పైసా విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం రైల్వేలకు ప్రాధాన్యమిస్తూ వీలైనంత త్వరలో ప్రాజెక్టుల పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవల అమరావతికొచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, డీపీఆర్ నరేంద్ర ఎ పాటిల్ సీఎం చంద్రబాబును కలిసి పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తి సహా కొత్త వాటిపై సమగ్రంగా చర్చించారు. ఈ నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్‌లో విశాఖ–విజయవాడ రైల్వే ట్రాక్ విస్తరణని ఆమోందిపజేసి త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో వందేభారత్ సహా పలు ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టి ప్రయాణికులను తక్కువ సమయంలోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు తొలగిన అడ్డంకులు - టోల్ బాధ్యత నుంచి జీఎమ్మార్ ఔట్! - hyderabad vijayawada highway