ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న విజయవాడ - పునరావాసాలు వీడి ఆవాసాలవైపు కదులుతున్న బాధితులు - Relief operations in Vijayawada - RELIEF OPERATIONS IN VIJAYAWADA

Vijayawada Floods : బుడమేరు వరద ఉద్ధృతికి జలదిగ్భందంలో చిక్కుకున్న విజయవాడలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద ముంపులో కొనసాగుతున్న బాధితులు తమ నివాసాలను వదిలి బయటకు వస్తున్నారు. నీళ్లు తగ్గిన చోట్ల తిరిగి ప్రజలు తమ ఆవాసాలకు చేరుకుంటున్నారు. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, ఇతర చెత్తాచెదారాలను తొలగించేందుకు అగ్నిమాపకశాఖ రంగంలోకి దిగింది. నీటిలో లేని కాలనీలు, నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Relief operations in Vijayawada
Relief operations in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 7:47 AM IST

Relief operations in Vijayawada : విజయవాడ నగరం వరద ముంపు నుంచి చాలా వరకు బయటపడింది. బుడమేరు ప్రభావంతో జలదిగ్భందంలో కొనసాగిన కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఊర్మిలానగర్‌, హెచ్​బీ కాలనీ, చిట్టినగర్‌, కేఎల్‌రావు నగర్, కబేళా, రామరాజునగర్‌, రోటరీనగర్‌ ప్రాంతాలను చుట్టుముట్టిన వరద నీరు బయటకు వెళ్తోంది. మోకాలు దిగువ వరకు మాత్రమే ఇప్పుడు నీరు ఉంది.

Vijayawada Recovering Flood Mode :న్యూరాజరాజేశ్వరి పేట వాంబేకాలనీ మూడు అడుగుల మేరకు వరద తగ్గింది. ఇంకా ఇళ్ల చుట్టూ నీరు ఉంది. పాయకాపురం, రాజీవ్‌నగర్‌లో మూడు అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్న ప్రజలకు ట్రాక్టర్లు, బోట్ల ద్వారా సాయం అందిస్తున్నారు. రాజీవ్‌నగర్‌, కండ్రిక, పాయకాపురం, పైపుల రోడ్డు, అజిత్‌సింగ్‌నగర్‌లలో వరద తగ్గుముఖం పట్టింది. అక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ :జక్కంపూడి వైఎస్సాఆర్‌ కాలనీ ఇంకా ముంపులోనే ఉంది. వరద నీటి మునకలో లేని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా తయారుచేసిన అత్యవసర వైద్య కిట్లను నేటి నుంచి వైద్యారోగ్యశాఖ యంత్రాంగం అందించనుంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహారం అందించేందుకు మారుమూల ప్రాంతాలకూ ఆహారప్యాకెట్లు, మంచినీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు అంతా బాధితులకు సాయం అందించే అంశంపై నేరుగా పర్యవేక్షిస్తున్నారు. వీధివీధికీ తిరిగి మరీ పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేశారు. నీళ్లు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిన ఒక్కో ప్రాంతానికి చేరుకుని ప్రక్షాళణ చర్యలు చేపడుతున్నారు. పెద్దఎత్తున అగ్నిమాపక శకటాలతో ముంపు ప్రాంతాల్లోని ఇళ్లను యజమానుల పర్యవేక్షణలో శరవేగంగా శుభ్రం చేస్తున్నారు.

Relief Operations Budameru Victims : బుడమేరు నీరు విజయవాడ నగరం దిగువన ప్రభావం చూపుతోంది. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ముస్తాబాద్‌, అడవినెక్కలం, సావరగూడెం, కేసరపల్లి గూడవల్లిలో వరద కొనసాగుతోంది. బుడమేరు ఉధృతి కారణంగా పడిన గండ్లకు తోడు ఏలూరు కాలువ వరద పలు గ్రామాలను చుట్టుముట్టుంది. వేల ఎకరాల పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి. దివిసీమకు వరద ముప్పు తగ్గింది.

నందివాడ మండలం పుట్టగుంట, పెదలింగాల, చినలింగాల, తుమ్మలపల్లి కుదరవల్లి, గ్రామాల్లో బుడమేరు వరద నీరు చేరింది. విజయదుర్గానగర్‌ ప్రాంతంలోని బుడమేరు మధ్యకట్ట వద్ద పడిన గండి నుంచి వరద నీరు ఏలూరు కాల్వలోకి చేరుతోంది. ఈ గండి వల్ల స్థానిక నివాస ప్రాంతాలకు పెద్దగా ప్రమాదం లేకపోవడంతో గండిపూడిక పనులు ప్రారంభించలేదు.

బుడమేరుకు పెరుగుతున్న వరద : ఇబ్రహీంపట్నం వద్ద వరద తగ్గినా- బుడమేరు గట్లు కవులూరు, ఈలప్రోలు వద్ద గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చేందుకు యుద్ధప్రాతికదికగా పనులు చేస్తున్నారు. ఇంకా బుడమేరుకు వరద పెరుగుతుండడం గండ్లు వద్దకు చేరుకునేందుకు సరైన అప్రోచ్‌ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్నేరు వాగులో 10,000ల క్యూసెక్కుల వరద వస్తోంది.

తగ్గేదేలే అంటున్న చంద్రబాబు - నడుంలోతు నీళ్లలోనూ నడుస్తూ బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada

త్వరగా క్లెయిమ్స్ పూర్తి చేయండి - బాధితులకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి: చంద్రబాబు - CM Chandrababu met Bankers

ABOUT THE AUTHOR

...view details