Free Sand Transport Irregularities in AP :ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నా కొందరు చెవ్వికెక్కించుకోవంలేదు. దళారులు ఉచిత ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు దారి మళ్లింస్తున్నారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉచిత ఇసుకను దళారులు అక్రమంగా దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉచిత ఇసుక విధానంను దెబ్బతీసే విధంగా ఉన్న అక్రమ రవాణపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. స్టాక్ యార్డ్, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని తెలిపారు. టిప్పర్లకు ఏర్పాటు చేసిన జీపీఎస్‌లను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడా అక్రమంగా ఇసుక నిల్వ ఉంచకుండా, తరలించకుండా ఉండే విధంగా అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. అనధికారికంగా ఇసుక డంప్‌లను నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటమని సీపీ స్పష్టంచేశారు.
ఇసుక తవ్వకాల్లో నాడు నేడు ఆయనదే - యథేచ్ఛగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా