Venkatayapalem Shiromundanam Case :ఆంధ్రప్రదేశ్‌లోసంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటనలో 28 ఏళ్ల విచారణ తర్వాత నేడు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. అలాగే ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులకు 18 నెలలు జైలుశిక్ష విధించారు.
నాంపల్లి కోర్టులో ప్రణీత్‌రావు, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ల ఉపసంహరణ - phone tapping case updates
అసలేం జరిగింది :1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. 2019 వరకు 148 సార్లు కేసు వాయిదా అనంతరం నిరవధికంగా విచారణ కొనసాగింది. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కేసు తీర్పు వేళ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ద్రాక్షారామం పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట - ఏప్రిల్ 23 వరకు జైల్లోనే - Arvind Kejriwal Judicial Custody
మరోసారి తిహాడ్ జైలుకు కవిత - ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ - BRS MLC Kavitha Judicial Custody