Vehicle Owner Got Rs. 1.17 Crore Fine in Eluru District :రవాణాశాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ వాహన తనిఖీ అధికారి చేసిన నిర్వాకంతో ఓ వాహన యజమానికి ఆన్‌లైన్‌లో ఏకంగా రూ.1.17 కోట్లు జరిమానా పడింది. కోటిన్నరకు పైగా జరిమానా విధించడంతో ఆ వాహనదారుడు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరులో పనిచేస్తున్న ఓ సీనియర్ వాహన తనిఖీ అధికారి ఈనెల 21న ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. నెల్లూరు నుంచి కైకలూరు చేపపిల్లల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనంపై ఓవర్ లోడ్ కేసు నమోదు చేశారు.
కానీ ఆ వాహన తనిఖీ అధికారి తనిఖీ చేస్తున్న సమయంలో మూడు టన్నులు అదనంగా మాత్రమే ఆ వాహనం ఓవర్ లోడ్‌తో వెళ్తుంది. అదనపు ఓవర్ లోడ్‌కు టన్నుకు 2 వేల చొప్పున జరిమానా విధించాల్సి ఉండగా అధికారి అత్యుత్సాహంతో 3 వేల టన్నులను ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో రూ.1.17 కోట్లు జరిమానా ఆన్‌లైన్‌లో విధించారు. ఈ భారీ జరిమానా చూసిన వాహన యజమాని కంగుతిన్నాడు.
'ఫైన్ చెల్లించకుంటే వాహనం జప్తు చేయండి - వారిని అస్సలు ఉపేక్షించవద్దు'