Special Trains for Diwali : పండగ వస్తే ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు వెళ్లాలనుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కలిసి మంచిచెడు, కష్టసుఖాలు పంచుకుంటారు. అయితే ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ సమస్యను నివారించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంటారు. పండగలకు నెలల ముందే ఈ రైళ్ల షెడ్యూలు ప్రకటిస్తారు. కానీ వాటిలో కూడా ముందే సీట్లన్ని రిజర్వ్ కావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రైల్వే అధికారులు అన్ రిజర్వుడ్ రైళ్లు నడుపుతున్నారు.
దీపావళి సీజన్‌తో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ - విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ (అన్ రిజర్వుడ్) ట్రైన్స్ నడుపుతున్నారు. ఈరోజు (నవంబర్ 1 నుంచి) ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ - విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ (08567) రైలు ఈ నెల 1, 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే, విజయవాడ - విశాఖ ప్రత్యేక రైలు (08565) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35 గంటలకు గమ్యం చేరుకోనుంది. జన్‌సాధారణ్ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
గోవా పర్యటకులకు గుడ్‌న్యూస్ - 9 నుంచి సికింద్రాబాద్-వాస్కోడిగామా బై వీక్లీ ట్రైన్