Union Minister Rammohan Naidu On Irumudi :అయ్యప్ప భక్తులకు కేంద్రమంత్రి కె. రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనానికి విమానంలో ప్రయాణించే భక్తులు ఇక నుంచి ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో పెట్టాల్సిన అవసరం లేదని నేరుగా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇప్పటివరకూ భద్రతా కారణాల దృష్ట్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు భక్తులు ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆనంతరం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్నే చెప్పారు.
"అయ్యప్ప స్మామి భక్తులు ఈ సమయంలో పెద్దఎత్తున మాలలు ధరించి, దీక్ష చేపట్టి, శబరిమల వరకు యాత్ర చేసి అయ్యప్ప స్మామిని దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ మాల ధరించి దర్శించుకోవడం చాలామంది చేస్తుంటారు. వారు ఉన్న మార్గాల్లో శబరిమల చేరుకుంటున్నారు. నా దృష్టికి ఓ చిన్న సమస్య వచ్చింది. అయితే ఏంటి సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం చెక్ఇన్ లోనే ఇరుముడిని ఇచ్చేయాలి. దీనిపై దృష్టి సారించి ఆ సమస్యను తొలగించాం. ఇప్పుడు విమానంలో ప్రయాణించే స్వాములు తమ వెంట ఇరుముడిని తీసుకెళ్లొచ్చు." - రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి
'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు
సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - rammohan naidu as aviation minister