తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్ అల్లర్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా- పోలీసులకు కీలక ఆదేశాలు - Union Minister Bandi Sanjay - UNION MINISTER BANDI SANJAY

Bandi Sanjay reacts reacts on Medak Riots : సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. గత శనివారం రాత్రి మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Union Minister Bandi Sanjay on Medak Riots
Bandi Sanjay reacts on Medak Riots (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 8:00 PM IST

Union Minister Bandi Sanjay on Medak Riots : మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ఘటనలో బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమయాకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టొద్దని బండి సంజయ్ స్పష్టం చేశారు. మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్‌ కోరారు.

ABOUT THE AUTHOR

...view details