తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ నేషనల్ హైవేపై కేంద్రమంత్రి బండి సంజయ్​ ఫోకస్​ - విస్తరణ పనులపై ఆరా! - Bandi Sanjay on Karimnagar Highway

Central Minister Bandi Sanjay on Highway : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేషనల్​ హైవే పనులపై కేంద్రమంత్రి బండి సంజయ్​, అధికారులతో సమీక్ష జరిపారు. ఈ మేరకు జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్రమంత్రి ఆరా తీయగా, ఇప్పటి వరకు 37 శాతం పూర్తయ్యాయని, 2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 10:47 PM IST

Union Minister Bandi Sanjay
Central Minister Bandi Sanjay on Highways (ETV Bharat)

Union Minister Bandi Sanjay Review on Karimnagar Highway : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కరీంనగర్–జగిత్యాల, కరీంనగర్, వరంగల్ (ఎన్ హెచ్ 563) జాతీయ రహదారి విస్తరణ పనులపై తన కార్యాలయంలో ఎన్​హెచ్ఏఐ అధికారులతో సమావేశమయ్యారు.

కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయి? ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు? కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? భూసేకరణ ఎంత వరకు వచ్చింది? టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? పనులెప్పుడు మొదలుపెడతారు? ఈ విషయంలో ఎదురువుతున్న ఇబ్బందులేమిటి? అనే అంశాలపై అధికారులతో కేంద్రమంత్రి చర్చించారు.

Bandi Sanjay Focus on Karimnagar Development : కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్, జగిత్యాల రహదరి విస్తరణ పనుల అంశం ఉండటంతో సెప్టెంబర్​లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు.

ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40 శాతం మేరకు పూర్తయ్యిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రహదారి విస్తరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.2,227 కోట్ల అంచనా వ్యయంతో 58 కి.మీల పొడవున చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతోపాటు 195 కల్వర్టులను నిర్మించనున్నట్లు వివరించారు.

2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యం : ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురువుతున్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించగా, సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అంతకుముందు కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు.

ఇప్పటి వరకు 37 శాతం పూర్తయ్యాయని, 2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వరకు 68 కి.మీ జాతీయ రహదారి విస్తరణ పనులు 37 శాతం మేరకు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్​పర్తి వద్ద బైపాస్​లను నిర్మించనున్నట్లు తెలిపారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి :29 మైనర్ జంక్షన్లను నిర్మించనున్నామన్నారు. గట్టుదుద్దెనపల్లి, చెంజర్లలో భూ సేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్​లో మాట్లాడారు. కరీంనగర్ ఆర్డీవోను పిలిపించి భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

అలాగే కొన్నిచోట్ల సర్వీస్, స్ట్రక్చరల్ రోడ్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు అందుతున్నాయని అధికారులు పేర్కొనడంతో ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బండి సంజయ్​తోపాటు ఎన్​హెచ్ఏఐ ప్రాజెక్ట్​ డైరెక్టర్ మాధవి, అధికారులు కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేశ్ త్రిపాఠి, కమలేశ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనం : కేంద్రమంత్రి బండి సంజయ్

సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? : బండి సంజయ్ - Bandi Sanjay on Singareni

ABOUT THE AUTHOR

...view details