ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

ETV Bharat / state

విభజన తర్వాత ఏపీకి రూ.35,491 కోట్లు - కేంద్రం వెల్లడి - AP BIFURCATION

Central Govt Funds to AP Under Special Assistance: రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పదేళ్లలో రూ.35,491 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన సమాచారానికి కేంద్ర ఆర్థికశాఖలోని ఎక్స్​పెండిచర్ విభాగం వివరాలు తెలిపింది.

Special Assistance to AP
Special Assistance to AP (ETV Bharat)

Central Govt Funds to AP Under Special Assistance:ఏపీ స్పెషల్‌ కేటగిరి ప్యాకేజీ కింద రూ.15.81 కోట్లు, విభజన తర్వాత ఏపీకి పదేళ్లలో రూ.35,491 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి కేంద్ర ఆర్థికశాఖలోని ఎక్స్​పెండిచర్ విభాగం వివరాలు తెలిపింది. స్పెషల్ అసిస్టెన్స్ కింద 2018-19లో, ఈఏపీ ప్రాజెక్టుల కింద 2015-20ల మధ్య రుణానికి సంబంధించి వడ్డీ కింద రూ.15.18 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. ఏపీఆర్ఏ చట్టంలోని రిసోర్స్ గ్యాప్ కింద రూ.16,078 కోట్లు, 7 వెనుకబడిన జిల్లాలకు 2014 నుంచి 2020 వరకూ రూ.1750 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.2500 కోట్లు, పోలవరానికి రూ.15,147 కోట్లు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా ఏపీ విభజన అనంతరం 10 ఏళ్లలో రూ.35,491.57 కోట్ల నిధులు ఇచ్చినట్టు ఆర్టీఐ సమాచారంలో కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details