ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 16న వైసీపీ తుది జాబితా - ఆశావహులు, అసంతృప్తులతో సీఎం జగన్ భేటీ - CM YS Jagan

CM YS Jagan Meet With UnHappy Leaders: ఈనెల 16న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. టికెట్ రాని నేతలు, టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఆందోళనల నేపథ్యంలో సీఎం జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నారు.

CM YS Jagan  Meet With UnHappy Leaders
CM YS Jagan Meet With UnHappy Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:11 PM IST

Updated : Mar 13, 2024, 7:23 PM IST

CM YS Jagan Meet With UnHappy Leaders: వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈనెల 16న 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్సార్సీపీ కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఆశావహులు, అసంతృప్తులతో సమావేశమై అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన పలు స్థానాల్లో అసంతృప్తి జ్వాలలు రేగడంతో వాటిని చల్లార్చే ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతోన్న పలువరు అసంతృప్తి నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. కొందరికి హామీలిస్తూ మరికొందరిని బుజ్జగిస్తూ పార్టీలో అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నాలు చేశారు. మూడు రోజుల్లో తుది జాబితా ప్రకటన దృష్ట్యా తమ సీట్లు ఉంటాయో లేదోనని పలువురు సిట్టింగ్ లు ఆందోళన చెందుతూ ముఖ్యనేతలతో ఆరా తీయిస్తున్నారు.

అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్న సీఎం:మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారుకు కోసం సీఎం జగన్‌ సన్నాహకాలు ప్రారంభించారు. టికెట్ రాని నేతలు, టికెట్ ఆశించి భంగపడిన నాయకులు గ్రూపులు, వర్గాలతో ఆందోళనలు చేస్తున్నారు. అసంతృప్త గళాలు పెరగడంతో, సీఎం జగన్ తన అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో కోలా గురువులు, తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా, కొడాలి నాని, మార్గాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, మంత్రి రోజా తదితరులు ఉన్నారు.

అంబటి మార్పుపై చర్చలు: మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి అసమ్మతి నేతలంతా ఏకమైన నేపథ్యంలో సీఎం జనగ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అంబటికి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, సత్తెనపల్లి ఇన్‌ఛార్జి మార్పు యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటి రాంబాబుకు పిలుపు వచ్చింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్ యాదవ్‌తో ఈ అంశంపై సీఎం జగన్‌ చర్చించినట్టు సమాచారం. నేతలతో చర్చించిన అనంతరం సత్తెనపల్లి టికెట్‌ అంబటికి ఇవ్వాలా? వద్దా? అనేది జగన్ నిర్ణయిస్తారని తెలుస్తోంది.
'ఇదేంది రాంబాబూ?' - లాటరీ కోసం పింఛన్​దారుల సొమ్ము స్వాహా

తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ: నరసరావుపేటలో వైఎస్సార్సీపీ నేతల గ్రూపు తగాదాలపై దృష్టి సారించిన జగన్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డిని పిలిపించి వారితో చర్చలు జరిపారు. గోపిరెడ్డికి సీటు ఇవ్వొద్దని కొంతకాలంగా బ్రహ్మారెడ్డి వర్గం ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బ్రహ్మారెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల నేతలతో చర్చించిన జగన్ కలిసి పని చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిత్తూరు జిల్లా నగరి పంచాయితీ తాడేపల్లికి చేరింది. గత కొంతకాలంగా రోజాకు నగరి సీటు ఇవ్వొద్దని అసమ్మతి నేతల ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం జగన్‌ను కలిసి రోజా అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం - కొనసాగుతోన్న ఫ్లాష్​​ సర్వేలు

Last Updated : Mar 13, 2024, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details