ఎపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు - అడ్డుకున్న పోలీసులు - పలువురు అరెస్ట్ Unemployed Youth Protest Against YCP Government : ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. గ్రూప్ -1 ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన రూ.150 కోట్ల కుంభకోణాన్ని భయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలకు నిరసనగా విజయవాడలోని ఎపీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.
ఎపీపీఎస్సీ గ్రూప్ -1 ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన రూ. 150 కోట్ల కుంభకోణాన్ని ప్రజలకు తెలియజేయాలని TNSF, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంలా మారిందని మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైన్స్, భూకుంభకోణాలు చాలక చివరికి నిరుద్యోగుల జీవితాలను దోచుకుంటున్నావని జగన్పై మండిపడ్డారు. ఇంత నీచున్ని ముఖ్యమంత్రి ఏలా చేశామా? అంటూ నిరుద్యోగులు వాపోయారు.
నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం.. విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి సందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్ధి నాయకులను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ యువజన నాయకులను అక్రమంగా అరెస్టులు చేయటం దారుణమన్నారు. ఇక జగన్ పని అయిపోయిందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు హెచ్చరించారు.
Youth Protest Against YCP Government Sathya Sai District :గ్రూప్-1 ఉద్యోగాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ప్రభత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల ఎదుటే జగన్ చిత్రపటాలను చింపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏపీపీఎస్సీ నియామకల్లో జగన్ రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని నాయకులు మీడియా ముఖంగా ఆరోపించారు. దీని పట్ల శాంతియుత నిరసన తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తేనే యువతకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
రోడ్డెక్కిన నిరుద్యోగ యువత...రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో రూ. 150 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. అనంతరం చినబాబు, మానం ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సంఘాలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంలా మారిందని జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యాలయ ముట్టడిని అడ్డుకుని విద్యార్థి నాయకులను అరెస్టు చేసి విజయవాడ కృష్టలంక పోసీస్ స్టేషన్కు తరలించారు.
Irregularities in Recruitment of APPSC Jobs : ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సత్యసాయి జిల్లా హిందూపురంలో విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం విద్యార్థి సంఘం, టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జగన్ సర్కార్ రూ.150 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ జిల్లాలో నిరుద్యోగ యువత నిరసన